AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghan Crisis: హమ్మయ్య.. ఆఫ్గనిస్థాన్‌లో భారతీయులందరూ సేఫ్.. కేంద్ర ప్రభుత్వ వర్గాల ధృవీకరణ

Afghanistan Crisis: ఆఫ్గనిస్థాన్‌లో దాదాపు 150 మంది భారతీయులను సాయుధ తాలిబన్లు అపహరించినట్లు కథనాలు వెలువడడం తెలిసిందే. కాబూల్ విమానాశ్రయానికి సమీపంలో వీరిని సాయుధ తాలిబన్లు అపహరించినట్లు కథనాలు వెలువడ్డాయి.

Afghan Crisis: హమ్మయ్య.. ఆఫ్గనిస్థాన్‌లో భారతీయులందరూ సేఫ్.. కేంద్ర ప్రభుత్వ వర్గాల ధృవీకరణ
Afghanistan Crisis
Janardhan Veluru
|

Updated on: Aug 21, 2021 | 2:16 PM

Share

Afghanistan Crisis: ఆఫ్గనిస్థాన్‌లో దాదాపు 150 మంది భారతీయులను సాయుధ తాలిబన్లు అపహరించినట్లు కథనాలు వెలువడడం తెలిసిందే. కాబూల్ విమానాశ్రయానికి సమీపంలో వీరిని సాయుధ తాలిబన్లు అపహరించినట్లు కథనాలు వెలువడ్డాయి. భారతీయులకు తాలిబన్లు హాని తలపెట్టవచ్చని తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయులందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరితో భారత దౌత్య అధికారులు టచ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని కాబూల్ నుంచి భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. భారతీయులను అపహరించిన తాలిబన్లు.. ఆ తర్వాత వారిని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌‌లో క్షేమంగా విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు విదేశాలు తీవ్రంగా స్పందించే అవకాశమున్నందునే వారికి ఎలాంటి హానితలపెట్టకుండా తాలిబన్లు విడుదల చేసినట్లు సమాచారం.

అటు ఆఫ్గనిస్థాన్ మీడియా వర్గాలు కూడా భారతీయులందరూ సేఫ్‌గా ఉన్నట్లు ధృవీకరించాయి. అయితే భారతీయుల నుంచి పాస్‌పోర్టులు తీసుకుని తమ వెంట ఎవరు తీసుకెళ్లారన్న దానిపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆఫ్గన్‌కు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. తాలిబన్లు భారతీయులను విడిచిపెట్టారని..వారిని కాబుల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని గ్యారేజీలో ఉంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వీరిని కాబుల్ విమానాశ్రయానికి తరలిస్తున్నట్లు తెలిపారు.

అంతకు ముందు 150 మంది భారతీయులను తాలిబన్లు అపహరించారన్న కథనాలను ఆ సంస్థ అధికార ప్రతినిధి అహ్మదుల్లా వసేక్ తోసిపుచ్చారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ కాబూల్ నుండి దాదాపు 150 మంది భారతీయులను అపహరించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని.. వారిని తాము సురక్షితంగా విమానాశ్రయానికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సురక్షిత గేట్ ద్వారా వారిని తాము విమానాశ్రయానికి చేర్చినట్లు తెలిపారు.

Also Read..

మేకను దొంగిలించేందుకు ప్రయత్నించాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ఆ ఆఫ్ఘన్ బేబీ సురక్షితం..తండ్రికి అప్పగించిన అమెరికన్ సైన్యం..కాబూల్ ఎయిర్ పోర్టు ఇంకా ఉద్రిక్తం