కమలదళంలోకి ఖుష్బూ

ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్ సోమవారం బీజేపీలో చేరారు. గత వారం రోజులుగా ఆమె బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుండగా.. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ...

కమలదళంలోకి ఖుష్బూ
Follow us

|

Updated on: Oct 12, 2020 | 2:26 PM

Actress Khushboo joined BJP: ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్ సోమవారం బీజేపీలో చేరారు. గత వారం రోజులుగా ఆమె బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుండగా.. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆమె సోమవారం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికలలో చాలా యాక్టివ్‌గా వుండే ఖుష్బూ గత కొంత కాలంగా తాను ఇన్ని రోజులు కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరడం ఖాయమన్న ప్రచారం మొదలైంది. దాన్ని నిజం చేస్తూ ఆమె బీజేపీలో చేరిపోయారు.

వచ్చే సంవత్సరం తొలి భాగంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. స్వతహాగా ముంబైకి చెందిన ఖుష్బూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తమిళ, తెలుగు సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా అగ్ర నటులందరి సరసన నటించారు. తమిళనాడుకు చెందిన బిజినెస్‌మాన్, నిర్మాత సుందర్‌ను వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. తమిళనాడులో ఆమెకు గుడి కట్టే స్థాయిలో అభిమానులుండడం విశేషం.

కొన్నేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖుష్బూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరడం గమనార్హం. తమిళనాడులో ప్రముఖులకు గాలమెం వేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల నాటికి సంఖ్యాబలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ ఖుష్బూని చేర్చుకున్నట్లు సమాచారం. మరోవైపు తమిళనాట రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలితల మరణం తర్వాత జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అధికార ఏఐఏడిఎంకే, డీఎంకే పార్టీలను వీలైనంతగా వీక్ చేయాలని కమలదళం వ్యూహం రచిస్తోంది. ఒకవైపు రజినీకాంత్ లాంటి వారిని దగ్గర చేసుకునేందుకు ట్రై చేస్తూనే వీలైనంత ఎక్కువ సంఖ్యలో ప్రముఖులను చేర్చుకుంటున్నారు కమలనాథులు.

Also read: ఉద్యోగులకు టీటీడీ బ్రహ్మోత్సవ కానుక