తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు
ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కర్నాటకలోని భళ్లారి దగ్గరున్న చారిత్రక తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీలోని 33 గేట్లలో మూడు గేట్లు ఎత్తి వేసి దిగువకు 32,588 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలోనికి వస్తున్న వరద నీరు ( ఇన్ ఫ్లో 46,250 )క్యూసెక్కులుగా ఉంటే, జలాశయం నుంచి బయటకు వెళ్లే వరద నీరు (అవుట్ ఫ్లో 45,926) క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 […]
ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కర్నాటకలోని భళ్లారి దగ్గరున్న చారిత్రక తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీలోని 33 గేట్లలో మూడు గేట్లు ఎత్తి వేసి దిగువకు 32,588 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలోనికి వస్తున్న వరద నీరు ( ఇన్ ఫ్లో 46,250 )క్యూసెక్కులుగా ఉంటే, జలాశయం నుంచి బయటకు వెళ్లే వరద నీరు (అవుట్ ఫ్లో 45,926) క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులుకాగా, ప్రస్తుత నీటి మట్టం 1632.00 అడుగులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు అయితే, ప్రస్తుత నీటి నిల్వ 100.600 టీఎంసీలు నమోదైంది. భారీగా కృష్ణమ్మ ఉరకలేస్తుండటంతో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ అప్రమత్తమైంది.