Toolkit Case: లక్ష రూపాయల పూచీకత్తుపై యాక్టివిస్ట్ దిశారవికి బెయిల్ మంజూరు, ఢిల్లీ కోర్టు తీర్పు.
Toolkit Case: టూల్ కిట్ కేసులో క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవికి ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ లభించింది
Toolkit Case: టూల్ కిట్ కేసులో క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవికి ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ లభించింది. ఖలిస్థాన్ అనుకూల గ్రూప్.. పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ ద్వారా ఆమె భారత వ్యతిరేక ప్రచారానికి పూనుకొందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈమెతో బాటు నిఖితా జాకబ్, శంతను ములుక్ అనే వారిపై కూడా వారు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో శంతను, నిఖితలకుకోర్టు నుంచి ముందే ట్రాన్సిట్ బెయిల్ లభించింది. ఇలా ఉండగా టూల్ కిట్ కేసులో పోలీసుల తీరుపై ఢిల్లీ కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం గమనార్హం. దిశారవికి, జనవరి 26 న ఢిల్లీలో జరిగిన ఘటనలకు సంబంధం ఉందనడానికి మీరు సేకరించిన ఆధారాలేమిటని కోర్టు వారిని ప్రశ్నించింది. అసలు టూల్ కిట్ అంటే ఏమిటని కూడా జడ్జి ప్రశ్నించారు. ఈ కేసులో వారు సమర్పించిన ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా-తన క్లయింటు దిశారవి కుటుంబం లక్ష రూపాయల బెయిల్ బాండ్ సమర్పించజాలదని, ఇది చాలా ఎక్కువ అని ఆమె లాయర్ కోర్టుకు తెలిపారు. మొదట దిశను కోర్టు గదికి తీసుకువస్తుండగా తన బంధువులను చూసి ఆమె ఉద్వేగంతో కంట తడి పెట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దిశా కస్టడీని మరో నాలుగురోజులపాటు పొడిగించాలని పోలీసులు పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమె కస్టడీని మరో 24 గంటలు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. మంగళ వారం ఉదయం దిశతో బాటు శంతను ములుక్, నిఖితా జాకబ్ లను కూడా పోలీసులు విచారించారు. విచారణ సందర్భంగా దిశ.. వీరిద్దరిపై ఆరోపణలు చేసిందని, అందువల్ల ఆమె బెయిలును నిరాకరించాలని పోలీసులు కోర్టును కోరారు.
Also Read:
Elon Musk : ఒక్క ట్వీట్ తో 1.10 లక్షల కోట్లు నష్టపోయిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్