PF Interest Rate: పీఎఫ్ చందదారులకు షాకింగ్ న్యూస్.. 40 ఏళ్ల కనిష్టానికి తగ్గిన వడ్డీ రేటు..
EPFO: ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO) ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పనుందా.? పీఎఫ్‌పై వడ్డీ రేటును భారీగా తగ్గించనుందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. విశ్వసనియ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం మేరకు..
EPFO Interest Rate:: ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO) ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పనుంది. పీఎఫ్‌పై వడ్డీ రేటును భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనియ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం మేరకు 2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ మొత్తాలపై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే కేంద్రం వడ్డీ రేట్లను 40 ఏళ్ల కనిష్టానికి తగ్గించినట్లవుతుంది. ప్రస్తుతం 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 8.1 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
వడ్డీ రేట్ల విషయమై చర్చించేందుకు గాను శనివారం ఈపీఎఫ్‌ఓ నిర్ణయ మండలి బోర్డు (CBT) గువహటిలో సమావేశమైంది. ఈ సమావేశంలో పీఎఫ్ వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 8.1 శాతం వడ్డీ రేటు నిర్ణయాన్నీ CBT కేంద్ర ఆర్థికశాఖకు పంపనుంది. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే చందాదారులకు వడ్డీ జమ చేయనున్నారు.
ఇదిలా ఉంటే 1977-78 తర్వాత ఇంత తక్కువ వడ్డీ రేటు ఇవ్వడం ఇదే తొలిసారి కానుంది. ఆ ఏడాది 8 శాతం వడ్డీ ఇవ్వగా, అనంతరం పెంచుతూ 2015-16 నాటికి 8.8 శాతానికి తీసుకొచ్చారు. అయితే కరోనా సమయంలో వడ్డీ రేట్లను 8.5 శాతానికి తగ్గించారు. ఇప్పుడు మరోసారి భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Viral: దారికాశారు.. డబ్బుల సంచితో వెళ్తుండగా.. షాకింగ్ విజువల్స్