Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్.. మంత్రిత్వశాఖకు ప్రాథమిక నివేదికను అందజేసిన ఏఏఐబి!
యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో అధికారులు పురోగతి సాధించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన తొలి నివేదికను కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు అందజేసింది. విమాన డేటా, ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు ఏం జరింగిందన్న కీలక అంశాలను నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం.

జూన్ 12న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సమీపంలోని మెడికల్ కాలేజ్ బిడ్డింగ్‌ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎంతో పాటు విమానంలోని 241 మంది ప్రయాణికులు,మెడికల్ కాలేజ్‌లోని 33 మంది సహా మొత్తం 270 మందికిపైగా మరణించగా ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం యాత్ దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇక ఈ ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత విమానం నుంచి బ్లాక్ బ్లాక్స్‌ను సేకరించిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రమాదానికి గల కరణాలను విశ్లేషించేందుకు దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించి మంగళవారం ఏఏఐబీ తమ ప్రాథమిక నివేదికను కేంద్ర మంత్రిత్వశాఖకు అందజేసింది. ఈ నివేదికలో విమానం డేటాతో పాటు ప్రమాదానికి కొద్దిసేపటి ముందు విమానంలో ఏం జరిగిందనే కీలక అంశాలను పొందుపర్చినట్టు తెలుస్తోంది. అయితే మంత్రిత్వ శాఖ మాత్రం ఈ నివేదికకు సంబంధించిన విషయాలను వెలువరించలేదు. కానీ త్వరలోనే ఈ విషయాలను బయటపెట్టనున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో విమానాశ్రయాలలో లెవీ ఛార్జీలు” గురించి చర్చించడానికి పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో జరింది. ఈ సమావేశంలో ఎయిర్ ఇండియా ప్రమాద సంఘటన గురించి తీవ్రమైన చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్ క్యాంప్‌బెల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఎంపీలు విమానయాన సంస్థల భద్రతా ప్రమాణాలపై విమానయాన అధికారులకు సూటిగా ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా సీఈవో సహా ఇతర అధికారులు పార్లమెంటరీ ప్యానెల్‌కు తమ వాదనలను వినిపించారు. అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం అత్యంత సురక్షితమైనదని తెలిపారు. ఈ మోడల్‌కు చెందిన సుమారు వెయ్యికి పైగా విమానాలు ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా సేవలను అందిస్తున్నాయని పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




