AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Linking Aadhaar with SBI account: బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ అనుసంధానం ఎలా చేయాలి..? సులభమైన పద్దతుల్లో మీ కోసం

Linking Aadhaar with SBI account: బ్యాంక్‌ ఖాతాలను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఖాతాదారులు తమ ఖాతాలను ఆధార్‌తో ..

Linking Aadhaar with SBI account: బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ అనుసంధానం ఎలా చేయాలి..? సులభమైన పద్దతుల్లో మీ కోసం
Subhash Goud
|

Updated on: Feb 20, 2021 | 4:28 PM

Share

Linking Aadhaar with SBI account: బ్యాంక్‌ ఖాతాలను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఖాతాదారులు తమ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే సమస్యలు ఎదురవుతాయి. మార్చి 31వ తేదీ లోపు అన్ని రకాల బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేసుకోవాలని కేంద్ర ఆర్థిఆక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం కొత్త ఆప్షన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఎస్‌బీఐ కస్టమర్లు ఎస్‌ఎంఎస్‌, ఏటీఎం, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లేదా నేరుగా బ్యాంక్‌కు వెళ్లి కూడా తమ సేవింగ్స్‌ ఖాతాకు ఆధార్‌తో లింక్‌ చేసుకోవచ్చు. వివిధ పద్దతుల్లో బ్యాంక్‌ అకౌంట్‌ ఆధార్‌తో అనుసంధానం చేయడం ఎలా అనేది చూద్దాం.

నెట్‌ బ్యాంకింగ్‌:

ఎస్‌బీఐ కస్టమర్లు నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా బ్యాంక్‌ ఖాతాను సులభంగా ఆధార్‌తో లింక్‌ చేసుకోవచ్చు. – ముందుగా ఖాతాదారులు www.onlinesbi.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి నెట్‌ బ్యాంకింగ్‌లోకి వెళ్లాలి. – సేవల కోసం సైన్‌ఇన్‌ కావాలి. – వెబ్‌పేజీలో కనిపించే ‘e-Services’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. ఆప్‌డేట్ ఆధార్‌ విత్‌ బ్యాంక్‌ అకౌంట్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. – దీనిని ఎంచుకుని ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను ధృవీకరించాలి. – డ్రాప్‌ డౌన్‌ లిస్ట్లో సీఐఎఫ్‌ నంబరు, ఆధార్‌ నంబరు నమోదు చేయాలి.అన్ని వివరాలు పూర్తయిన తర్వాత Submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. – ఈ విధానంలో ఆధార్ వివరాలు సేవింగ్స్ అకౌంట్‌కు వెంటనే అనుసంధానం అవుతాయి. – ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు మెసేజ్‌ కూడా వస్తుంది.

ATM ద్వారా..

నెట్‌ బ్యాంకింగ్‌ సర్వీసు వాడనివారు ఏటీఎం ద్వారా కూడా ఆధార్‌ లింక్‌ చేసుకునే సదుపాయం తీసుకువచ్చింది ఎస్‌బీఐ. – ముందుగా ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లి డెబిట్‌ కార్డును స్లాట్‌లో పెట్టాలి. – పిన్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత.. డిస్‌ప్లేపై కనిపించే ‘Service Registration’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి – ఆ తరువాత Aadhaar Registration అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి అకౌంట్, ఆధార్ నంబరును నమోదు చేయాలి. – ఖాతాదారుల రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయిన తరువాత అకౌంట్ ఆధార్‌కు లింక్ అవుతుంది

SBI మొబైల్ యాప్ ద్వారా..

స్మార్ట్‌ ఫోన్‌లో ఎస్‌బీఐ ఎనీవేర్‌ పర్సనల్‌ మొబైల్‌ యాప్‌ ఓపెన్‌ చేసి కూడా ఆధార్‌ నంబర్‌ అనుసంధానం చేసుకోవచ్చు.

– ముందుగా స్మార్ట్‌ ఫోన్‌లో SBI ఎనీవేర్ పర్సనల్ మొబైల్ యాప్ ఓపెన్ చేయాలి – అక్కడ ‘Requests’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. – డ్రాప్ డౌన్ లిస్ట్‌లో కనిపించే Aadhaar Linking ఆప్షన్‌ను ఎంచుకోవాలి. – ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి ధ్రువీకరించాలి. టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను యాక్సెప్ట్ చేసి వివరాలను సబ్మిట్‌ చేయాలి. – అనంతరం అకౌంట్ ఆధార్‌తో లింక్ అయినట్లు నోటిఫికేషన్ వస్తుంది.

SMS ద్వారా..

బ్యాంక్‌ అకౌంట్‌తో మొబైల్‌ నంబర్‌ రిజిస్టర్‌ చేసుకున్న ఖాతాదారులు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అకౌంట్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోవచ్చు.

– ముందుగా మేసేజెన్‌ విభాగంలో UID(స్పేస్) ఆధార్ నంబరు(స్పేస్)అకౌంట్ నంబరు టైప్ చేయాలి. – రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి 567676కు SMS పంపాలి. – బ్యాంకు కస్టమర్ల రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన తరువాత అకౌంట్‌, ఆధార్ లింక్ అవుతాయి. -ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది.

SBI బ్యాంక్ ద్వారా..

ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి కూడా ఆధార్‌ నంబర్‌ అనుసంధానం చేసుకవోచ్చు. ఏవైనా వివరాలు తెలియకపోతే బ్యాంక్‌ సిబ్బందిని అడిగితే చెబుతారు.

– బ్యాంకుకు వెళ్లి ఒక దరఖాస్తు ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. – ఆ తరువాత దీన్ని ఖాతాదారుడు సంతకం చేసిన ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో కలిపి అధికారులకు ఇవ్వాలి. – అవసరమైతే ఒరిజినల్ ఆధార్ కార్డును బ్యాంకులో చూపించాల్సి ఉంటుంది. – వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తరువాత కస్టమర్లకు ఒక ఎకనాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. – బ్యాంకు ఈ రిక్వెస్ట్‌ను ఆమోదించిన తరువాత అకౌంట్‌ ఆధార్‌తో లింక్ అవుతుంది.

Also Read: FASTag: మార్చి 1వ తేదీ వరకు ఉచితంగా ఫాస్టాగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..