FASTag: మార్చి 1వ తేదీ వరకు ఉచితంగా ఫాస్టాగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..

Up To March 1st Free FASTag: దేశంలోని టోల్‌ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే..

FASTag: మార్చి 1వ తేదీ వరకు ఉచితంగా ఫాస్టాగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2021 | 10:48 AM

Up To March 1st Free FASTag: దేశంలోని టోల్‌ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15ను చివరి తేదీగా ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఫాస్టాగ్‌ కొనుగోల్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. కేవలం రెండు రోజుల్లోనే 2.5 లక్షల ఫాస్టాగ్‌ అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే వాహనదారులకు శుభవార్త చెబుతూ కేంద్రం ఫాస్టాగ్‌ విషయంలో తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. సాధారణంగా ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాలంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కానీ దీన్ని మార్చి 1వరకు ఉచితంగా అందించనున్నారు. కార్డులో డబ్బులు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో భాగంగా దేశంలోని 770 టోల్‌ప్లాజాల వద్ద ఉచితంగా ఫాస్టాగ్‌ను అందించనున్నారు. ఇక ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ తేదీని ప్రకటించిన తొలి రెండు రోజుల్లోనే 87% వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ ద్వారా చెల్లింపులు జరిపాయని కేంద్ర రవాణా శాఖ తెలిపింది. ఇక 100 టోల్‌ప్లాజాల వద్ద 90% వాహనాలు ఫాస్టాగ్‌తో వెళ్లాయని పేర్కొంది. మైఫాస్టాగ్‌ యాప్‌లో పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఇక మైఫాస్టాగ్‌ యాప్‌లో ‘చెక్‌ బ్యాలెన్స్‌ స్టాటస్‌’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ ఎంత ఉందన్న విషయం వినియోగదారుడు సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు.

Also Read: Indo-china Talks: భారత-చైనా దేశాల మధ్య నేడు పదో దఫా చర్చలు, ఇక ఖాళీ కానున్న గాల్వన్ లోయ.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా