AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: వీడి దొంగ తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఏకంగా పులి బోనులో దూరి మరీ.. వీడియో చూసేయండి..

నాన్‌వెజ్‌ ప్రియులు కోడి కనిపించిందంటే చాలు లొట్టలేస్తుంటారు. వెంటనే చికెన్‌ బిర్యానీనో, చికెన్‌ 65వో ఏదోకటి లాగించాలనుకుంటారు. అయితే కొందరికి విచిత్రమైన అలవాటు ఉంటుంది. అదేనండి..

Trending Video: వీడి దొంగ తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఏకంగా పులి బోనులో దూరి మరీ.. వీడియో చూసేయండి..
Tiger Boan
Ganesh Mudavath
|

Updated on: Feb 26, 2023 | 7:18 AM

Share

నాన్‌వెజ్‌ ప్రియులు కోడి కనిపించిందంటే చాలు లొట్టలేస్తుంటారు. వెంటనే చికెన్‌ బిర్యానీనో, చికెన్‌ 65వో ఏదోకటి లాగించాలనుకుంటారు. అయితే కొందరికి విచిత్రమైన అలవాటు ఉంటుంది. అదేనండి వీరికి దొంగ కోడి యమ రుచిగా ఉంటుందని భావిస్తారు. దాంతో ఎక్కడ కోడి కనిపించినా లటుక్కున పట్టేసుకుని గుటకాయస్వాహా చేసేస్తుంటారు. ఇలాంటి ఓ వ్యక్తి కోడి కోసం ఏకంగా పులిబోనులోకి వెళ్లి ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పులిని బంధించేందుకు ఏర్పాటు చేసిన బోనులోకి ఒక వ్యక్తి వెళ్లాడు. పులి కోసం ఎరగా బోనులో ఉంచిన కోడిని చోరీ చేసేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే డోర్‌ మూసుకుపోవడంతో ఆ వ్యక్తి పులి బోనులో చిక్కుకుపోయాడు. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో జరిగింది.

బసెందువా గ్రామంలో ఒక చిరుత పులి సంచరిస్తోంది. భయాందోళన చెందిన గ్రామస్తులు దాని గురించి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిరుత జాడను గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది దానిని పట్టుకునేందుకు ఆ గ్రామంలో ఒక బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎర కోసం ఆ బోనులో ఒక కోడిని ఉంచారు. కాగా, పులి బోనులో ఉన్న కోడిపై ఒక వ్యక్తి కన్ను పడింది. ఆ కోడిని చోరీ చేసి ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినాలని అతడు భావించాడు. గుట్టుగా ఆ బోనులోకి ప్రవేశించాడు. లోపలున్న కోడిని పట్టుకున్నాడు. అయితే ఆ వెంటనే ఆ పులి బోను మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి బోను లోపల చిక్కుకున్నాడు. నన్ను రక్షించండి బాబోయ్‌ అంటూ బావురుమన్నాడు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 24న ఉదయం గ్రామస్తులు వచ్చి చూసేసరికి బోనులో పులికి బదులు ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. విషయం వారికి అర్థమైంది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బోను ముందున్న ఇనుప ఊచల డోర్‌ను ఓపెన్‌ ఆ వ్యక్తిని బయటకు రప్పించారు. కాగా, స్థానికులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..