Ganesh Idols: కళకు మతం లేదు.. వినాయకుని విగ్రహాలు తయారు చేస్తున్న ముస్లీం మహిళ
వినాయక చవితి వచ్చిందంటే చాలా గ్రామాల నుంచి నగరాల వరకు ఎక్కడా చూసినా గణేషుని విగ్రహాలే కనిపిస్తాయి. చాలామంది కార్మికులు ఉపాధి కోసం వినాయకుని విగ్రహాలు తయారుచేస్తుంటారు. అయితే గత రెండు సంవత్సరాలుగా కర్ణాటకలోని వినాయకుని విగ్రహాలు తయారు చేసే బృందంలో ఓ ముస్లీం మహిళ పనిచేస్తోంది. గణేషుని విగ్రహాలకు ఫైనల్ కోట్ ఇచ్చేందుకు ఈ మహిళ పనిచేస్తోంది. ప్రతిఏడాది కూడా వర్షకాలం రాకముందే వినాయకుని విగ్రహ తయారీని ప్రారంభిస్తారు.

వినాయక చవితి వచ్చిందంటే చాలా గ్రామాల నుంచి నగరాల వరకు ఎక్కడా చూసినా గణేషుని విగ్రహాలే కనిపిస్తాయి. చాలామంది కార్మికులు ఉపాధి కోసం వినాయకుని విగ్రహాలు తయారుచేస్తుంటారు. అయితే గత రెండు సంవత్సరాలుగా కర్ణాటకలోని వినాయకుని విగ్రహాలు తయారు చేసే బృందంలో ఓ ముస్లీం మహిళ పనిచేస్తోంది. గణేషుని విగ్రహాలకు ఫైనల్ కోట్ ఇచ్చేందుకు ఈ మహిళ పనిచేస్తోంది. ప్రతిఏడాది కూడా వర్షకాలం రాకముందే వినాయకుని విగ్రహ తయారీని ప్రారంభిస్తారు. ఆ తర్వాత వినాయక చవితి వచ్చే సమయానికి వాటిని విక్రయిస్తారు. అయితే ఈ విగ్రహాల తయారీదారు నిరుపమా యాదవ్‌కు సుమన అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆభరణాల రూపకల్పన అలాగే విగ్రహానికి తుది మెరుగులు దిద్దేందుకు ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు పనిచేస్తున్నారు. ఇంట్లోని ఆర్థిక సమస్యల కారణంగా సుమన తన ఇంటికి సమీపంలోనే ఉన్న విగ్రహాల తయారీ యూనిట్‌లో పనిచేస్తోంది.
మరో విషయం ఏంటంటే పర్యావరణహితంగా ఉండేటటువంటి వినాయకుడి విగ్రహలు తయారుచేయడంతో సహా వివిధ రకాల రూపాలున్న గణేషుడ్ని తయారుచేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వినాయకుడి విగ్రహాల నిషేధం జరిగిన తర్వాత మట్టితో వినాయకుని విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించారు. అలాగే వివిధ వర్గాలకు చెందిన 6 మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నట్లు నిరుపమా యాదవ్ తెలిపారు. ఇందులోనే ముస్లీం వర్గానికి చెందిన ఓ మహిళ కూడా ఉన్నారని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ రోజుల్లో నాణ్యమైన మట్టిని పొందడం చాలా కష్టతరమైపోయింది. అయితే మట్టితో తయారు చేసిన విగ్రహాలు చాలా సులువుగా అమ్ముడుపోతున్నాయని నిరుపమా యాదవ్ అన్నారు. అందుకోసమే పాపులర్ అయినటువంటి పోర్‌బందర్ చక్ మిట్టి.. అలాగే వార్తపత్రికలతో విగ్రహాలు తయారు చేయాలని అనుకున్నట్లు తెలిపారు. చాక్ పౌడర్, న్యూస్ పేపర్ కలయిక తక్కువ బరువు ఉంటుందని.. వాటికి పగుళ్లు కూడా రావని నిరుపమా చెబుతున్నారు.
అయితే ఈ భాగంలో కాగితం నుంచి వినాయకుడిని తయారుచేసే ఏకైక సంస్థగా కూడా వీరు నిలిచారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 500 వరకు వినాయకుని విగ్రహాలను వీరు తయారుచేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి పర్యావరణహిత వినాయకుని విగ్రహాలు తయారు చేస్తున్నామని వారు తెలిపారు. కుల, మత, లింగ, భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. అయితే ఈ విగ్రహాలు తయారుచేయడంపై ముస్లీం మహిళ కూడా స్పందించింది. ప్రస్తుత రోజుల్లో కులం, మతాల మధ్య అశాంతి నెలకొందని పేర్కొంది. ఇలాంటి నేపథ్యంలో ముస్లీం మతానికి చెందిన తాను హిందూ సంప్రదాయ పద్ధతిలో వినాయకుని విగ్రహాలు తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం