PM Modi: వచ్చే హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. ప్రధాని కీలక వ్యాఖ్యలు
హెల్త్ ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న హెల్త్ ఎమర్జెన్సీని నివారించేందుకు, దాన్ని ఎదుర్కొవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన జీ-20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.నిర్దేశిత 2030 లక్ష్యానికి ముందే క్షయ వ్యాధి నిర్మూలన దిశగా భారత్ ముందడుగులు వేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. వైద్య రంగంలో సాంకేతికత లభ్యతను అందిరికి సులభతరం చేసేలా చొరవ చూపాలని జీ20 సభ్యలను కోరారు. ప్రజాప్రయోజన ఆవిష్కరణలకు అందరూ ముందుకు రావాలన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




