Aadhar Update: ఆధార్ అప్‌డేట్ పేరిట మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు.. అప్రమత్తంగా లేకపోతే ఇక అంతే సంగతులు
ఆధార్‌కార్డు ఉండటం అనేది ప్రతిఒక్కరికి తప్పనసరి అయిపోయింది. ఎటువంటివాటికైనా ఆధార్ కార్ట్ చూపించాల్సి వస్తోంది. ప్రస్తుతం బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా.. లేదా ఏవైన వస్తువులు కొనుగోలు చేయాలన్నా కూడా ఆధార్‌కార్డ్ ఉండాల్సిందే. అలాగే ప్రత్యేకించి వాహనాలు కొనాలన్నా.. చివరికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా కూడా ఆధార్ కార్డు అవసరం అవుతుంది. సాధారణంగా ఆధార్‌కార్టు నమోదు చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుంటాయి.

ఆధార్‌కార్డు ఉండటం అనేది ప్రతిఒక్కరికి తప్పనసరి అయిపోయింది. ఎటువంటివాటికైనా ఆధార్ కార్ట్ చూపించాల్సి వస్తోంది. ప్రస్తుతం బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా.. లేదా ఏవైన వస్తువులు కొనుగోలు చేయాలన్నా కూడా ఆధార్‌కార్డ్ ఉండాల్సిందే. అలాగే ప్రత్యేకించి వాహనాలు కొనాలన్నా.. చివరికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా కూడా ఆధార్ కార్డు అవసరం అవుతుంది. సాధారణంగా ఆధార్‌కార్టు నమోదు చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. చిన్న పిల్లలకు పుట్టిన తేదీ ప్రకారం ఐరీష్, ఫింగర్ ప్రింట్స్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొందరిరి ఇంటిపేర్లు, చిరునామా మార్చుకోవాల్సి వస్తుంది. మరికొందరికి పేర్లు కూడా తప్పుగా రావడం వల్ల వాటిని మార్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం విశిష్ట ప్రాధికార సంస్థ ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. కానీ ఈ మధ్య ఆర్థిక సేవలు మొదలుకొని డ్రైవింగ్ లైసెన్స్‌ల వరకు ప్రతిదీ కూడా ఆన్‌లైన్‌లో జరగడంతో సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు.
ఆధార్‌కార్డ్ అప్‌డేట్ చేసుకోవాలమటూ మెసేజ్‌లు చేస్తూ అధికారిక సంస్థల పేరిట పంపుతున్నారు. ఇందుకు సంబంధించి ఈ-మెయిల్‌కూ, వాట్సాప్‌కూ కూడా సందేశాలూ.. లింక్స్‌ను పంపుతున్నారు. ఇలాంటి లింక్‌లు, మెసెజ్‌లు వస్తే్ అలర్ట్‌గా కచ్చితంగా అలెర్ట్‌గా ఉండాలని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి పౌరులు తమకి తామే ఆధార్ అప్‌డేట్ చేసుకుంటారు తప్పా.. అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వ సంస్థలు కొరవని చెబుతున్నారు. దీన్ని వాడుకుంటూ ఆయా సంస్థల పేరిట సైబర్ మోసగాళ్లు వ్యక్తిగత డేటాను తస్కరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. మరో విషయం ఏంటంటే ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే గడువు ముగుస్తుందని.. ఈ క్రమంలో తమకు వచ్చే్ లింక్‌లు, మెసేజ్‌లు నిజమేనని నమ్మే ప్రమాదం ఉందని గుర్తించిన ఉడాయ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇతర మార్గాల్లో ఆధార్ అప్‌డేట్ చేసుకోవద్దని సూచించారు.
ఇదిలా ఉండగా భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకొకసారి ఆధార్‌కార్డ్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి గత నెల 14తో గడువు ముగిసినప్పటికీ కూడా.. యూఐడీఏఐ వచ్చే నెల 14 వరకు పొడగించింది. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్‌తో ఆధార్ ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత Proceed to Update Address అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.. అనంతరం మీరు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. అలాగే అటు డాక్యుమెంట్ అప్‌డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్ మీద కనిపించేటువంటి మీ ఆధార్ వివరాల్లో ఏవైన సవరణలు చేయాల్సి ఉంటే వాటిని సరిచేసి ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై డ్రాప్ డౌన్‌ను ఎంచుకొని అందులో గుర్తింపు కార్డు, చిరునామా గుర్తింపు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అలాగే అక్కడ స్కాన్ చేసిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దీంతో ఆధార్ అప్ డేట్ ప్రక్రియ పూర్తవుతుంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం