Odisha Train Accident: చనిపోయాడనుకొని మృతదేహాల తరలించే ట్రక్కులో ఎక్కించారు.. కానీ అంతలోనే

ఒడిశా రైలు ప్రమాదం జరిగిన అనంతరం సహాయక సిబ్బంది మృతదేహాలను తరలించే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి చనిపోయాడనుకొని మృతదేహాలు తరలించే లారీలో ఎక్కించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమబెంగాల్‌కు చెందిన బిశ్వజిత్ మాలిక్ అనే వ్యక్తి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు.

Odisha Train Accident: చనిపోయాడనుకొని మృతదేహాల తరలించే ట్రక్కులో ఎక్కించారు.. కానీ అంతలోనే
Odisha Train Accident
Follow us
Aravind B

|

Updated on: Jun 06, 2023 | 10:24 AM

ఒడిశా రైలు ప్రమాదం జరిగిన అనంతరం సహాయక సిబ్బంది మృతదేహాలను తరలించే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి చనిపోయాడనుకొని మృతదేహాలు తరలించే లారీలో ఎక్కించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమబెంగాల్‌కు చెందిన బిశ్వజిత్ మాలిక్ అనే వ్యక్తి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. బాలేశ్వర్ ప్రాంతలో రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బిశ్వజిత్ చేతికి తీవ్ర గాయం కావడంతో ఎటూ కదలలేకపోయాడు. గాయం తీవ్రంగా బాధిస్తున్నప్పటికి రైలు నుంచి బయటపడ్డాడు. ఎవరినైనా సాయం కోసం పిలవాలనుకున్న నోటి నుంచి మాట రాలేదు. అతని కళ్లు మూసుపోయాయి.

కొద్ది సేపటి తర్వాత బిశ్వజిత్‌కు తన జేబులో ఉన్న ఫోన్ మోగుతున్నట్లు అనిపించడంతో లేచాడు. తనకి రెండు వైపుల కొంతమంది అచేతనంగా పడి ఉండటాన్ని చూసి షాకయ్యాడు. తనని కూడా చనిపోయాడనుకుని భావించి మృతదేహాలను తరలించే లారీలో ఎక్కించారని గ్రహించాడు. అక్కడున్న వారికి తాను బతికే ఉన్నాడని తెలిసేలా తన ఎడమచేతిని పైకెత్తాడు. ఇది గమనించిన సహాయక సిబ్బంది.. బిశ్వజిత్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని.. వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓర్నీ !! భక్తితో గుడికొచ్చాడనుకుంటే.. దేవుడికే ఎసరు పెట్టాడుగా..!
ఓర్నీ !! భక్తితో గుడికొచ్చాడనుకుంటే.. దేవుడికే ఎసరు పెట్టాడుగా..!
డాకు మహరాజ్‌లో అదిరిపోయే ఫైట్స్‌..
డాకు మహరాజ్‌లో అదిరిపోయే ఫైట్స్‌..
గడ్డకట్టిన చెరువులో యువతి నిర్వాకం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్
గడ్డకట్టిన చెరువులో యువతి నిర్వాకం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్
చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం
చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం
ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..
ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..
రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..
రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..
12 రోజుల పాటు ట్రాఫిక్‌ జామ్‌ !! మళ్లీ వైరల్‌ అవుతున్న దృశ్యాలు
12 రోజుల పాటు ట్రాఫిక్‌ జామ్‌ !! మళ్లీ వైరల్‌ అవుతున్న దృశ్యాలు
మహిళలకు దివ్యఔషధం ఇది.. బీట్‌రూట్ జ్యూస్ రోజూ తాగితే..
మహిళలకు దివ్యఔషధం ఇది.. బీట్‌రూట్ జ్యూస్ రోజూ తాగితే..
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..