వీడెక్కడోడండి బాబు.. 50 మంది మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేశాడు.. చివరికి

ఈ మధ్య చాలామంది మ్యాట్రిమోని సైట్లను నమ్ముకుని మోసపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ లక్షల రూపాయలు మోసాలకు పాల్పడున్నారు. ఇలాంటి వేదికను వినియోగించుకుని 50 మంది మహిళల్ని బురిడి కొట్టించి లక్షల రూపాయలు దోచుకున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీడెక్కడోడండి బాబు.. 50 మంది మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేశాడు.. చివరికి
Marriage
Follow us
Aravind B

|

Updated on: Jun 11, 2023 | 10:42 AM

ఈ మధ్య చాలామంది మ్యాట్రిమోని సైట్లను నమ్ముకుని మోసపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ లక్షల రూపాయలు మోసాలకు పాల్పడున్నారు. ఇలాంటి వేదికను వినియోగించుకుని 50 మంది మహిళల్ని బురిడి కొట్టించి లక్షల రూపాయలు దోచుకున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌లో తబేష్ కుమార్(55) అనే వ్యక్తి ఉండేవాడు. 1992లో కోల్‌కతాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కూతుర్లు. కానీ పెళ్లైన 8 ఏళ్లకే భార్య పిల్లల్ని వదిలిపెట్టి తబేష్ దూరంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ కంపెనీని ప్రారంభించి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి చాలమందిని మోసం చేశాడు. ఆ తర్వాత మళ్లి తన మోసాలకు అడ్డాగా షాదీ మ్యాట్రిమోనీని ఎంచుకున్నాడు.

ఇందులో విడాకులు తీసుకున్న, భర్తను కోల్పోయిన మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇలా దాదాపు 50 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారితో శారీరంకంగా గడిపి ఆ తర్వాత వాళ్ల నగలు, డబ్బులు దొచుకుని పారిపోయేవాడు. బాధిత మహిళలల్లో కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.మరో విషయం ఏంటంటే ఇందులో వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు కూడా ఉండటం గమనార్హం.

అయితే కొన్ని చోట్ల తబేష్‌పై బాధిత మహిళలు ఫిర్యాదు చేయడంతో గతంలో అతడ్ని అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడు. తబేష్ పై మళ్లీ పలువురు మహిళల ఫిర్యాదుతో హర్యానా పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎట్టకేలకు ఒడిశాలో ఉన్న తబేష్‌ను అరెస్టు చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..