వావ్ అద్భుతం.. బరువు తగ్గడం కోసం శస్త్రచికిత్స చేయించుకున్న 9 మంది కుటుంబ సభ్యులు.. చివరికి
మహారాష్ట్రలోని ముంబాయిలో అనూహ్య ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది శస్త్రచికిత్స చేసుకుని బరువు తగ్గడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే ముంబయికి చెందిన ఆ కుటంబీకులు అధిక బరువుతో బాధపడుతుండేవారు.
మహారాష్ట్రలోని ముంబాయిలో అనూహ్య ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది శస్త్రచికిత్స చేసుకుని బరువు తగ్గడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే ముంబయికి చెందిన ఆ కుటంబీకులు అధిక బరువుతో బాధపడుతుండేవారు. అలాగే తమకు తాము ఏదైన పని చేసుకోవాలనుకున్న ఇబ్బంది పడుతుండేవారు. దీంతో ఇది భరించలేక ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి ఎలాగైన బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. మొదటగా బేరియాట్రిక్ అనే సర్జరీ చేసుకున్నాడు. ఆ సర్జరీ సక్సెస్ అయ్యింది. అతను బరువు తగ్గాడు. దీంతో మిగతా కుటుంబ సభ్యులు సైతం ఆ సర్జరీ చేసుకునేందుకు ముందుకు వచ్చారు.
ఒకరి తర్వాత ఒకరు సర్జరీ చేసుకున్నారు. వీళ్లందరూ కూడా ఏడు సంవత్సరాల వ్యవధిలోనే బరువు తగ్గేశారు. మరో విషయం ఏంటంటే తాజాగా అదే కుటుంబానికి చెందిన ఓ 19 ఏళ్ల అమ్మాయి కూడా బరువు తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంది. అయితే మొదటగా ఆమె 120 కిలోల బరువుతో బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స చేయించుకున్న తర్వాత 101 కిలోలకు బరువు తగ్గిందని వెల్లడించారు. అలాగే ఇంకా మరికొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా ఈ కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది సర్జరీ చేయించుకున్నారు. అయితే వీళ్లలో 60 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వయస్సు వారు ఉన్నారు.