PM Kisan 14th Instalment: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు పడేది అప్పుడే..
e-KYC Done Before July 15th: PM-కిసాన్ పథకం రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో చెల్లించబడుతుంది.
PM Kisan Samman Nidhi: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. PM కిసాన్ 14వ విడత విడుదల తేదీని వెల్లడించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత జూలై 27న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. జూలై 15 లోపు EKYC చేసిన లబ్ధిదారులకు డబ్బు లభిస్తుందని తెలిపింది. వచ్చే గురువారం 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2,000 జమ చేస్తారు. పీఎం కిసాన్ యోజన 13వ విడత ఫిబ్రవరి 27 న విడుదలైంది. బెల్గామ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ డబ్బు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు రాజస్థాన్‌లోని సికార్‌లో 14వ విడత విడుదలను ప్రధాని ప్రకటించనున్నారు. జులై 27 న రైతులతో మమేకమయ్యే అవకాశం ఉంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకోవడం సరిపోదు.. EKYC అప్‌డేట్ చేయాలి. ఈకేవైసీ చేయని వారికి 13వ వాయిదా డబ్బులు రాలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 14వ విడత డబ్బులు అందాలంటే జూన్ 15 లోగా లబ్ధిదారుల ఖాతాలను అప్‌డేట్ చేయాలి. జూన్ 9 న చేసిన ట్వీట్‌లో, జూన్ 15 లోపు EKYC పూర్తి చేయాలని ప్రభుత్వం పథకం యొక్క లబ్ధిదారులను అభ్యర్థించింది.
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో లబ్ధిదారుల పేర్లను తనిఖీ చేయండి ఇలా..
- PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌ను సందర్శించండి..
- హోమ్‌పేజీలోని రైతుల కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి
- మీ రాష్ట్రం , జిల్లా , ఉప జిల్లా , బ్లాక్, గ్రామాన్ని ఎంచుకుని , నివేదిక పొందండిపై క్లిక్ చేయండి
PM కిసాన్ సమ్మాన్ నిధి స్థితి తనిఖీ దశలు:
- PM కిసాన్ సమ్మాన్ నిధి యొక్క అధికారిక వెబ్‌సైట్- pmkisan.gov.in ని సందర్శించండి
- హోమ్‌పేజీలో ‘ఫార్మర్స్ కార్నర్’ విభాగంపై క్లిక్ చేయండి
- ‘బెనిఫిషియరీ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
- రిజిస్టర్డ్ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
- ‘డేటా పొందండి’పై క్లిక్ చేయండి
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం