7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆగస్టు మొదటి వారంలోనే..

7th Pay Commission: డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపునకు సంబంధించి ప్రకటన కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆగస్టు మొదటి వారంలోనే..
Money
Follow us

|

Updated on: Jul 15, 2022 | 5:47 PM

7th Pay Commission: డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపునకు సంబంధించి ప్రకటన కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పనుంది. ఆగస్టు మొదటి వారంలో జరగునున్న మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జూలై నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఊహించిన దానికంటే ఎక్కువ డీఏ పెంపునకు సంబంధించి కసరత్తు చేయనున్నారని తెలుస్తొంది. కాగా, ఆల్ ఇండియా CPI-IW డేటా, AICP ఇండెక్స్, DA పెంపును కన్ఫామ్ చేస్తున్నాయి.

డీఏ పెంపు ఎప్పుడు ప్రకటిస్తారు? తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆగస్టులో డియర్‌నెస్ అలవెన్స్‌లో ఆరు శాతం పెంపు ఉండవచ్చు. అంటే మొత్తం డీఏ 40 శాతానికి చేరుకునే ఛాన్స్ ఉంది. ఈ డీఏ పెంపుకు సంబంధించిన ప్రకటనను ప్రభుత్వం ఆగస్టు మూడవ వారంలో వెలువరించే ఛాన్స్ ఉంది. కాగా, ఈ మంత్రివర్గ సమావేశం ఆగస్టు 3న జరిగే అవకాశం ఉంది.

అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను ఏడాదికి రెండుసార్లు సవరిస్తారు. మొదటిది జనవరి నుండి జూన్ వరకు, రెండవది జూలై నుండి డిసెంబర్ వరకు వస్తుంది.

ఏప్రిల్, 2022కి ఆల్-ఇండియా CPI-IW 1.7 పాయింట్లు పెరిగి 127.7 (నూట ఇరవై ఏడు పాయింట్లు ఏడు) వద్ద స్థిరపడింది. 1 నెల శాతం మార్పుపై, ఏడాది క్రితం సంబంధిత నెలల మధ్య నమోదైన 0.42 శాతం పెరుగుదలతో పోలిస్తే.. గత నెల 1.35 శాతం పెరుగుదల నమోదైందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. తాజా ప్రభుత్వ నివేదికల ప్రకారం, మే నెలలో AICPI గణాంకాలు 129 వద్ద ఉన్నాయి. దీని ప్రకారం DA ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.

2022 సంవత్సరానికి కరువు భత్యంలో మొదటి పెంపును మార్చిలో ప్రకటించారు. డిసెంబర్ 2021లో, AICPI సంఖ్య 125.4గా ఉంది. కానీ, జనవరి 2022లో 0.3 పాయింట్లు క్షీణించి 125.1కి పడిపోయింది. ఫిబ్రవరి, 2022కి ఆల్-ఇండియా CPI-IW 0.1 పాయింట్లు తగ్గి 125.0 (నూట ఇరవై ఐదు) వద్ద నిలిచింది. 1 – నెల శాతం మార్పుపై, ఇది ఒక సంవత్సరం క్రితం సంబంధిత నెలల మధ్య నమోదైన 0.68 శాతం పెరుగుదలతో పోలిస్తే మునుపటి నెలకు 0.08 శాతం తగ్గింది. మార్చి నెలలో 1 పాయింట్ పెరిగింది. మార్చిలో ఏఐసీపీఐ సూచీ గణాంకాలు 126గా ఉన్నాయి.

1.16 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది చేకూరుస్తూ.. డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్)లను 34 శాతానికి పెంచుతూ మార్చి 30న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..