7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! జీతం రూ.8,000 పెంపు.. ఎవరికి ప్రయోజనం ఉంటుందో తెలుసా?

Government Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల డీఏ, డీఆర్‌లను కేంద్ర ప్రభుత్వం మరోసారి 3 శాతం పెంచింది. ఈ పెంపుదల జూలై 1, 2021 నుండి అమల్లోకి రానుంది.

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! జీతం రూ.8,000 పెంపు.. ఎవరికి ప్రయోజనం ఉంటుందో తెలుసా?
Modi
Follow us

|

Updated on: Mar 13, 2022 | 7:24 AM

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు శుభవార్త. ఉద్యోగుల డీఏ, డీఆర్‌లను కేంద్ర ప్రభుత్వం మరోసారి 3 శాతం పెంచింది. ఈ పెంపుదల జూలై 1, 2021 నుండి అమల్లోకి రానుంది. హోలీ పండగకి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) సర్కార్.. భారీ బహుమతి ప్రకటించింది. భృతిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దాని వల్ల కొంతమంది కేంద్ర ఉద్యోగులు మాత్రమే ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఉద్యోగుల జీతం రూ.1,000 నుంచి రూ.8,000కి పెరుగునుంది. అలాగే, రక్షణ శాఖలోని సివిల్ ఉద్యోగుల రిస్క్ అలవెన్స్‌ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ పే కమిషన్ సిఫారసుల మేరకు ఉద్యోగులకు ఈ భత్యం దక్కనుంది.

రక్షణ శాఖలోని అనేక వర్గాల సివిల్ ఉద్యోగులకు కూడా రిస్క్ ఖాతా ప్రయోజనం చేకూరనుంది. పోస్ట్‌ను బట్టి ఈ భత్యం కూడా మారుతుంది. వార్షిక ప్రాతిపదికన లెక్కింపు చేస్తే, ఈ భత్యం ద్వారా, ఉద్యోగుల జీతం ఏటా రూ.1,000 నుండి రూ. 8,000 వరకు పెరిగింది. ఈ కేటగిరీలో వచ్చే ఉద్యోగుల భత్యం గురించి చెప్పాలంటే, నాన్ టెక్నికల్ సిబ్బందికి నెలకు 90 రూపాయల రిస్క్ అలవెన్స్ లభిస్తుంది. దీంతోపాటు సెమీ కుషన్ సిబ్బందికి రూ.135, స్కిల్డ్ సిబ్బందికి రూ.180, నాన్ గెజిటెడ్ అధికారికి రూ.408, గెజిటెడ్ అధికారికి రూ.675 చొప్పున ఈ అలవెన్స్ అందజేయనున్నారు.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల డీఏను 31 శాతానికి పెంచింది. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల డీఏ, డీఆర్‌లను పెంచింది. ఒడిశా ఉద్యోగులు కూడా కేంద్ర ఉద్యోగుల మాదిరిగానే 31% DA, DR ల ప్రయోజనాలను పొందనున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని 3% పెంచారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని దాదాపు 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయంతో లబ్ధి పొందుతున్నారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను మరోసారి పెంచవచ్చని తెలుస్తోంది. AICPI ఇండెక్స్ డేటాను పరిశీలిస్తే, డిసెంబర్ 2021 వరకు, డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతానికి పెరిగింది. అంటే దీని ప్రకారం ఇందులో 3 శాతం పెరుగుదల కనిపించింది. హోలీకి ముందు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. మొత్తం డీఏ 3 శాతం నుంచి 34 శాతానికి పెరుగుతుందని చెబుతున్నారు.

Read Also…  PAN Alert: పాన్ కార్డ్ అలా వాడుతున్నారా? వెంటనే జాగ్రత్తపడకపోతే బుక్కైపోతారు..