Parliament: భద్రతా వైఫల్యంపై దద్దరిల్లిన పార్లమెంట్ .. ఒక్కరోజే 78 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
పార్లమెంట్‌లో కలర్ స్మోక్ దాడి ఘటనపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సభలో స్టేట్‌మెంట్ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభలో హంగామా సృష్టించిన విపక్ష ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమావేశాలు ముగిసే వరకు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు
పార్లమెంట్ చరిత్రలో ఒక్కరోజే 78 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడడం తీవ్ర సంచలనం రేపుతోంది. రాజ్యసభలో 45 మంది లోక్‌సభలో 33 మందిపై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది. అంతకుముందే 14 మంది లోక్‌సభ ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో ఉభయసభల నుంచి సస్పెండయిన వాళ్ల సంఖ్య 92కు చేరుకుంది. పార్లమెంట్‌లో కలర్ స్మోక్ దాడి ఘటనపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సభలో స్టేట్‌మెంట్ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభలో హంగామా సృష్టించిన విపక్ష ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమావేశాలు ముగిసే వరకు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. లోక్‌సభలో స్పీకర్‌ను , రాజ్యసభలో ఛైర్మన్‌ను అవమానించే రీతిలో విపక్ష ఎంపీలు ప్రవర్తించారని ఆరోపించారు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్. 11 మంది ఎంపీలపై సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. లోక్‌సభలో కలర్ స్మోక్ ఘటనపై ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేస్తునప్పటికి విపక్ష ఎంపీలను అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.
‘ప్లకార్డులు పట్టుకొని వెల్ లోకి రావద్దని సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేశాం. అయినప్పటికి వాళ్ల తీరుమారలేదు. అందుకే 33 మంది లోక్‌సభ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సమావేశాల ఆఖరిరోజు వరకు రాజ్యసభలో 34 మందిని ఛైర్మన్ సస్పెండ్ చేశారు. మరో 11 మందిని సస్పెండ్ చేస్తూ వాళ్ల పేర్లను ప్రివిలేజ్ కమిటీకి పంపించాం. నిబంధనలు ఉల్లంఘించి వెల్‌లోకి ప్లకార్డులతో దూసుకొచ్చినందుకు ప్రివిలేజ్ కమిటీ వాళ్లపై చర్యలు తీసుకుంటుంది ‘ అని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ చెప్పుకొచ్చారు.
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో పాటు ఏ రాజా , సౌగత్‌రాయ్ , దయానిధి మారన్ , గౌరవ్ గగోయ్ తదితరులు సస్పెండైన వారిలో ఉన్నారు. గత వారం కూడా స్పీకర్ 16 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష ఎంపీలు . పార్లమెంట్ మకరద్వారం దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. ‘విపక్షాల గొంతును నొక్కడానికే పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రజాసమస్యలను లేవనెత్తుతున్న ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. సెక్యూరిటీ లోపాలపై మాట్లాడితే సస్పెండ్ చేయడం దారుణం. చర్చ కోసమే పార్లమెంట్ ఉంది. కాని ఇప్పుడు సస్పెన్షన్ల కోసమే పార్లమెంట్‌ను నడుపుతున్నారు’ అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రతి పక్ష సభ్యుల ఆందోళన..
MPs from like-minded parties protest on the stairs to the Parliament against the suspension of opposition MPs from Lok Sabha and Rajya Sabha. pic.twitter.com/VB9KacjMXG
— Congress (@INCIndia) December 18, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..