Army Dog: సైనికుడిని రక్షించేందుకు ప్రాణాలు త్యాగం చేసిన ఆర్మీ డాగ్‌.. వీర మరణం పొందిన శునకం

ఉగ్రదాడిలో జవాన్‌ని కాపాడేందుకు ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఆరేళ్ల కెంట్ శునకం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లో మంగళవారం (సెప్టెంబర్‌ 12) చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నార్ల గ్రామంలో మంగళవారం (సెప్టెంబర్ 12) ఉగ్రదాడి జరిగింది. ఈ సమయంలో జరిగిన సెర్చ్‌ ఆపరేషన్‌ చేపడుతోన్న బృందం..

Army Dog: సైనికుడిని రక్షించేందుకు ప్రాణాలు త్యాగం చేసిన ఆర్మీ డాగ్‌.. వీర మరణం పొందిన శునకం
Army Dog Kent
Follow us

|

Updated on: Sep 13, 2023 | 3:11 PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13: ఉగ్రదాడిలో జవాన్‌ని కాపాడేందుకు ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఆరేళ్ల కెంట్ శునకం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లో మంగళవారం (సెప్టెంబర్‌ 12) చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నార్ల గ్రామంలో మంగళవారం (సెప్టెంబర్ 12) ఉగ్రదాడి జరిగింది. ఈ సమయంలో జరిగిన సెర్చ్‌ ఆపరేషన్‌ చేపడుతోన్న బృందం కెంట్‌ అనే ఆరేళ్ల ఆర్మీ డాగ్‌ను తీసుకెళ్లింది.

ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ‘ఆపరేషన్‌ సుజలిగాల’లో భాగంగా ఓ పొద దగ్గర సైనికుల బృందం కెంట్‌ను అనుసరిస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులను పసిగట్టిన శునకం సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీగా కాల్పుల జరిగాయి. ఈ నేపథ్యంలో పాక్‌ చెందిన ఉగ్రవాదులు ఓ సైనికుడిని చుట్టుముట్టింది. వెంటనే కెంట్ వారికి ఎదురుగా వెళ్లి పరుగులు తీసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో కెంట్‌ శునకం తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ఘటనలో మరో జవాన్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు భద్రతా బలగాలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పాక్‌ ఉగ్రవాదిని భారత ఆర్మీ మట్టుబెట్టింది.

ఇవి కూడా చదవండి

జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేశ్‌ సింగ్ మాట్లాడుతూ..’ఆపరేషన్ సుజలిగల’లో ఆర్మీ డాగ్ కెంట్ పాల్గొంది.పారిపోతున్న ఉగ్రవాదుల జాడను కెంట్‌ చాకచక్యంగా సైనికులకు చేరవేసింది. ఈ సమయంలో నార్ల గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఓ సైనికుడిని రక్షించడానికి కెంట్‌ తన ప్రాణాలను పణంగా పెట్టింది. కెంట్‌ 21వ ఆర్మీ డాగ్‌ యూనిట్‌లోని లాబ్రడార్‌ జాతికి చెందిన ఆడ శునకం. దేశం కోసం చేసిన గొప్ప త్యాగం ఇది అంటూ అని పేర్కొంది. కెంట్ త్యాగానికి నివాళులు అర్పిస్తూ భారత సైన్యం ట్విటర్‌ వేదికగా నివాళులు అర్పించారు. కాగా కెంట్ గత 5 ఏళ్లలో 8 కార్యకలాపాలలో పాల్గొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.