Viral: 1000 బస్తాల ఉప్పు లోడ్ దిగింది.. కానీ కొన్ని బస్తాల నుంచి వాసన తేడాగా వచ్చింది.. చెక్ చేస్తే

గుజరాత్​లోని ముంద్రా పోర్టుకి ఇరాన్ నుంచి 1000 బస్తాల ఉప్పు లోడ్ వచ్చింది. ఆ లోడ్‌లోని కొన్ని బస్తాల్లో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అధికారులకు ఉప్పు అందింది. తనిఖీలు చేయగా...

Viral: 1000 బస్తాల ఉప్పు లోడ్ దిగింది.. కానీ కొన్ని బస్తాల నుంచి వాసన తేడాగా వచ్చింది.. చెక్ చేస్తే
Cocaine
Follow us

|

Updated on: May 27, 2022 | 2:58 PM

డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేయడం ఇప్పుడు సంబంధిత అధికారులకు, పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. రోజుకో కొత్త మార్గంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు స్మగ్లర్స్. ఇందుకోసం అనువైన అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. ముందస్తు సమాచారం ఉంటే.. అధికారులు ఈ దందాలను ఆపగలుగుతున్నారు. తాజాగా గుజరాత్‌( Gujarat)లో భారీగా కొకైన్‌(cocaine) పట్టుబడింది. ‘ఆపరేషన్‌ నమ్కీన్‌'(Operation Namkeen)లో భాగంగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రూ.500 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పు మాటున డ్రగ్స్ రవాణాకు తెరదీశారు కేటుగాళ్లు. ఇరాన్‌ నుంచి ఉప్పు పేరుతో మాల్ వచ్చిందనే.. పక్కా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు ముంద్రా పోర్టులో దాడులు చేశారు. 1,000 బస్తాల ఉప్పు లోడ్‌లో కొన్ని బస్తాల్లో కొకైన్ ఉందన్న పక్కా ఇన్ఫర్మేషన్‌తో.. మే 24 నుండి 26 వరకు మూడు రోజుల సుదీర్ఘ సోదాలు చేశారు. కొన్ని సంచుల్లో అనుమానాస్పద సరుకు ఉన్నట్లు గుర్తించారు. సదరు సంచుల నుంచి ప్రత్యేకమైన వాసన రావడంతో శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు తరలించారు.  డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ అధికారులు పరీక్షలు నిర్వహించి ఈ శాంపిల్స్‌లో కొకైన్ ఉన్నట్లు నిర్ధారించారు. సోదాల్లో డీఆర్‌ఐ అధికారులు 57 కిలోల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. కొకైన్‌ రవాణాకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

గతంలోనూ ఇదే పోర్టులో భారీ డ్రగ్స్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. DRI అధికారులు ముంద్రా పోర్టులో రూ. 9వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడతో లింక్‌లు సైతం ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇంటిలిజెన్స్ సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకొని చెక్ చేయగా భారీ మొత్తంలో హెరాయిన్‌ బయటపడింది. ఆ కంటైనర్లు అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఈ కంటైనర్లు ఏపీలోని విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్‌ సంస్థకు చెందినవిగా డీఆర్‌ఐ అధికారులు గుర్తించిన విషయం విదితమే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..