Nirmala Sitharaman: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీ.. ఉద్యోగ ఖాళీలపై లోక్‌సభలో మంత్రి సమాధానం
Nirmala Sitharaman: ప్రభుత్వ రంగ బ్యాంకులలో 41,177 ఉద్యోగ పోస్టులు ఖాళీ ఉన్నట్లు తాజాగా లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం..

Nirmala Sitharaman: ప్రభుత్వ రంగ బ్యాంకులలో 41,177 ఉద్యోగ పోస్టులు ఖాళీ ఉన్నట్లు తాజాగా లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 8,05,986 ఉద్యోగాలు ఉన్నాయి. లెక్కల ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో అత్యధికంగా 8,544 ఖాళీను భర్తీ చేయాల్సి ఉంది. అయితే లోక్‌సభలో సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పలు ఉద్యోగాలకు ఖాళీలు ఏర్పడ్డాయని, దీంతో ఉద్యోగాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది.. ఆ విషయం మీకు తెలుసా..? అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లిఖిత పూర్వంగా సమాధానం ఇచ్చారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి బ్యాంకులకు కేటాయించిన పోస్టుల్లో 95 శాతం భర్తీ అయ్యాయని ఆమె లోక్‌సభలో వెల్లడించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు కేటాయించిన 8,05,986 ఉద్యోగాల్లో కేవలం 41,177 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
ఆఫీసర్, క్లర్క్, సబ్‌స్టాఫ్ విభాగాల్లో ఖాళీలు..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల అంశాన్ని సభలో లేవనెత్తడంతో మంత్రి నిర్మలాసీతారామన్ పూర్తి వివరాలు వెల్లడించారు. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్, క్లర్క్, సబ్‌స్టాప్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ► ఎస్‌బీఐ 8,544
► పంజాబ్ నేషనల్ బ్యాంకులో 6,743
► సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,295
► ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకులో 5,112
► బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,848
ఇవి కూడా చదవండి: