Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. 40 మంది రెడ్‌లైట్ ఏరియా మహిళలకు ఒక్కడే భర్త.. ఎక్కడంటే

ప్రస్తుతం బిహార్ లో రెండోదశ కులగణన జరగుతోంది. అయితే ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్న అధికారులు షాకైపోయిన ఘటన చోటుచేసుకుంది . ఒక్కరు కాదు ఇద్దరు కాదు. దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్తగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

వామ్మో.. 40 మంది రెడ్‌లైట్ ఏరియా మహిళలకు ఒక్కడే భర్త.. ఎక్కడంటే
Woman
Follow us
Aravind B

|

Updated on: Apr 26, 2023 | 11:34 AM

ప్రస్తుతం బిహార్ లో రెండోదశ కులగణన జరగుతోంది. అయితే ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్న అధికారులు షాకైపోయిన ఘటన చోటుచేసుకుంది . ఒక్కరు కాదు ఇద్దరు కాదు. దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్తగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ కుల గణనలో భాగంగా.. కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతుల వంటి విషయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. అర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ఏరియాలో ఉంటున్న వారి వివరాలు సేకరించేందుకు సిబ్బంది అక్కడికి వెళ్లారు.

అయితే అక్కడ సుమారు 40 మంది మహిళలు తమ భర్త పేరు రూప్‌చంద్ అని చెప్పుకొచ్చారు. చాలామంది పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్‌చంద్ అని తెలిపారు. ఇది చూసిన అధికారులు కంగుతిన్నారు. ఆ తర్వాత ఇంతమంది ఒకే పేరు ఎందుకు చెబుతున్నారని ఆరాతీయగా.. అసలు విషయం బయటపడింది. అసలు రూప్‌చంద్ అనే వ్యక్తి లేడని తెలుసుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో డబ్బులని రూప్‌చంద్ గా భావిస్తారు. అందుకే అక్కడి మహిళలు ఆ పేరు పేరునే తమ భర్త పేరుగా స్వీకరించారు. మరికొంతమంది మహిళలు తమ తండ్రుల పేర్లు కూడా రూప్‌చంద్ అని నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ కుల గణన కోసం బిహార్ ప్రభుత్వం రూ. 500 కోట్లు ఖరారు చేసింది. దాదాపు 17 అంశాలపైన ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

మూడో ప్రపంచం ముంగిట ప్రపంచం..ఆందోళన కలిగిస్తున్న సలోమ్ జ్యోస్యం
మూడో ప్రపంచం ముంగిట ప్రపంచం..ఆందోళన కలిగిస్తున్న సలోమ్ జ్యోస్యం
IPL History: డెబ్యూ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు వీరే..
IPL History: డెబ్యూ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు వీరే..
మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే
మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే
వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !
వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !
ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోండి.. గూగుల్ హెచ్చరిక!
ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోండి.. గూగుల్ హెచ్చరిక!
పెంపుడు జంతువుల విషయంలో ఈ తప్పులు చేయకండి..?
పెంపుడు జంతువుల విషయంలో ఈ తప్పులు చేయకండి..?
మనసు దోచుకుంటున్న పిల్లిపిల్లకు కుక్క సాయం వీడియోపై ఓ లుక్ వేయండి
మనసు దోచుకుంటున్న పిల్లిపిల్లకు కుక్క సాయం వీడియోపై ఓ లుక్ వేయండి
ఈ అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఈ అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇక్కడ తొలిసారిగా వందేభారత్‌.. 38 సొరంగాలు.. 927 వంతెనలు దాటుకుంటూ
ఇక్కడ తొలిసారిగా వందేభారత్‌.. 38 సొరంగాలు.. 927 వంతెనలు దాటుకుంటూ
అర్ధరాత్రి మిస్టరీ మహిళ.. డోర్‌బెల్స్‌ మోగిస్తుండటంతో జనంలో భయం
అర్ధరాత్రి మిస్టరీ మహిళ.. డోర్‌బెల్స్‌ మోగిస్తుండటంతో జనంలో భయం