Chennai: తస్మాత్ జాగ్రత్త.. అత్యాశ పడ్డారో ఇలా మునిగిపోవాల్సిందే.. బయటపడ్డ భారీ మోసం..
మనిషి అత్యాశే సకల సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో అత్యాశతో నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. అత్యశతో ముక్కుమొహం తెలియని వాళ్లను, మార్కెట్‌లో గుర్తింపు లేని సంస్థలన్నింటినీ నమ్మి.. ఎడాపెడా పెట్టుబడులు పెట్టేస్తుంటారు. ఆ తరువాత మోసపోయి లబోదిబోమంటారు.

మనిషి అత్యాశే సకల సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో అత్యాశతో నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. అత్యశతో ముక్కుమొహం తెలియని వాళ్లను, మార్కెట్‌లో గుర్తింపు లేని సంస్థలన్నింటినీ నమ్మి.. ఎడాపెడా పెట్టుబడులు పెట్టేస్తుంటారు. ఆ తరువాత మోసపోయి లబోదిబోమంటారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. బిట్ కాయిన్స్ పేరుతో రూ. 50 కోట్లు వసూళ్లకు పాల్పడ్డారు కేటుగాళ్లు. ఆపై చేతులెత్తేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అరుణ్ కుమార్ అండ్ గ్యాంగ్.. కృష్ణగిరి కేంద్రంగా ఏ.కే ట్రేడర్స్ పేరుతో కార్యక్రమాలు ప్రారంభించారు. చైన్ సిస్టమ్ మాదిరిగా, క్రిప్టో కరెన్సీ పేరుతో దందా మొదలు పెట్టారు. బిట్ కాయిన్స్ పేరుతో ప్రజల వద్ద నుంచి దాదాపు రూ. 50 కోట్లు వసూలు చేశారు. తమిళనాడు, కర్ణాటకలో ప్రజలను మభ్యపెట్టి భారీగా డబ్బు వసూలు చేశారు. లాభాలు వస్తాయంటూ నమ్మించి వంచించారు. తీరా చూస్తే అదంతా బోగస్ అని తేలింది. దాంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ జరుపుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..