Jammu Kashmir: ఇళ్లలోకి చొరబడి ఉగ్రవాదుల మారణకాండ.. నలుగురు మృతి.. మరో నలుగురి పరిస్థతి విషమం..
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో తీవ్రవాదులు మారణకాండకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన భీభత్సంలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. రాజౌరీలోని డాంగ్రి గ్రామంలోకి చొరబడిన ఇద్దరు ముష్కరులు..

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో తీవ్రవాదులు మారణకాండకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన భీభత్సంలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. రాజౌరీలోని డాంగ్రి గ్రామంలోకి చొరబడిన ఇద్దరు ముష్కరులు.. పౌరులపై నిన్నరాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రవాదుల కాల్పుల్లో మొత్తం నలుగురు గ్రామస్థులు మృతి చెందారు. మరో పదిమందికి బుల్లెట్ గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన వారిని ఆసుపత్రిలో చేర్చారు. మూడు ఇళ్ళల్లోకి చొరబడిన తీవ్రవాదులు పౌరులపై విచక్షణారహితంగా ఎటాక్ చేశారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా మారింది. తీవ్రగాయాలపాలైన వారిని జమ్మూకశ్మీర్‌కి విమానంలో తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు, పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకున్నాయి. నిందితుల కోసం భారత భద్రతాదళాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టాయి. గ్రామం, చుట్టుపక్కల ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఈ ఉగ్రవాద దాడి అనంతరం జమ్మూకశ్మీర్ లోని భయాందోనలు నెలకొన్నాయి.
ఉప్పర్ డాంగ్రీ గ్రామంలో హిందువుల ఇళ్లే లక్ష్యంగా కాల్పుల సంఘటన జరిగింది. ఉగ్రవాదుల దాడుల గురైన ఇళ్లు ఒకదానికొకటి 50 మీటర్ల దూరంలో ఉంటాయని.. మూడు ఇళ్లపై కాల్పులకు తెగబడ్డారని పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు పౌరులు గాయాలతో మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మృతులను దీపక్ కుమార్ (23), సతీష్ కుమార్ (45), ప్రీతమ్ లాల్ (56), శివ్ పాల్ (32)గా గుర్తించారు. గాయపడిన వారిని పవన్ కుమార్ (38), రోహిత్ పండిట్ (35), సరోజ్ బాలా (35), సుశీల్ కుమార్ (40), శుభ్ శర్మ (20), ఊర్వశి శర్మ (17)గా గుర్తించారు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు తెలిపారు.




Jammu and Kashmir | Visuals from Rajouri’s upper Dangri village where 4 civilians were killed by terrorists yesterday pic.twitter.com/gcGYx6mjlk
— ANI (@ANI) January 2, 2023
ఈ దాడులను పాక్ టెర్రరిస్టుల ఎటాక్స్‌గా భావిస్తున్నారు. ఈ దాడులు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హిందూ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడిగా భావించిన కొన్ని సంస్థలు పాక్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా బంద్‌కి పిలుపునిచ్చాయి. బీజేపీ ఈ బంద్‌కి మద్దతుపలికింది.
గత రెండు వారాల్లో తీవ్రవాదులు పౌరులను హతమార్చడం ఇది రెండోసారి. డిసెంబర్ 16న సైతం రాజౌరీలోని ఆర్మీక్యాంప్ వెలుపల ఇద్దరు పౌరులను తీవ్రవాదులు కాల్చి చంపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..