Watch Video: 300 ఫీట్ల లోతున్న బోర్‌వెల్‌లో పడిపోయిన చిన్నారి.. స్పందించిన ముఖ్యమంత్రి
ఈ మధ్య చిన్నారులు బోర్‌వేల్‌లో పడిపోవడం లాంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బోర్ వేసిన చోట ఏదైన కప్పి ఉంచాలని ఎంత అవగాహన కల్పించినప్పటికీ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్‌లోని సేహోర్ జిల్లాలోని ఓ మూడేళ్ల చిన్నారి బోర్‌వేల్ లో పడిపోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.

ఈ మధ్య చిన్నారులు బోర్‌వేల్‌లో పడిపోవడం లాంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బోర్ వేసిన చోట ఏదైన కప్పి ఉంచాలని ఎంత అవగాహన కల్పించినప్పటికీ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్‌లోని సేహోర్ జిల్లాలోని ఓ మూడేళ్ల చిన్నారి బోర్‌వేల్ లో పడిపోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే ముంగావులి అనే గ్రామంలో స్రిష్టి అనే మూడేళ్ల తిన్నారి తన ఇంటి బయట ఉన్న పొలం వద్ద ఆడుకుంటోంది. ఇంతలోనే ఒక్కసారిగా 300 ఫీట్ల లోతులో ఉన్న బోర్‌వేల్‌లో పడిపోయింది. సమాచారం మేరకు సహాయక సిబ్బంది అక్కడి చేరుకున్నారు.
ఆ చిన్నారి 25 నుంచి 30 ఫీట్ల లోతులో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. జేసీబీ మిషన్లతో బోర్‌వేల్‌ను తవ్వారు. 20 ఫీట్ల లోతుకు చేరుకోగానే.. ఓ పెద్ద రాయి అడ్డుతగిలింది. దీంతో రాక్ డ్రిల్లింగ్ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఆ బోర్‌వేల్‌లోని కెమెరాను పంపించారు. అలాగే ఆ చిన్నారికి గాలి ఆడటం కోసం ఆక్సిజన్‌ను కూడా అందజేస్తున్నారు. ఆమె పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సరైన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఆ చిన్నారి పడిపోయిన బోర్‌వేల్ భూమి పక్క గ్రామానికి చెందిన వ్యక్తిదని.. అతడు ఆ బోర్‌వేల్‌ను మూసివేయకుండా అలాగే వదిలేసి వెళ్లాడని ముంగవాలి గ్రామ పంచాయతి సెక్రటరీ తెలిపారు.




A 3-year-old girl girl fell into a 300-feet deep #Borewell outside her house in #Sehore of #MadhyaPradesh . The girl is said to be stuck between 25 and 30 feet depth. Rescue operation is under way. pic.twitter.com/PCZ8akyQKx
— TOI Bhopal (@TOIBhopalNews) June 6, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




