Goods Train: తృటిలో తప్పిన ప్రమాదం..! పట్టాలు తప్పిన ఎల్పీజీతో వెళ్తోన్న గూడ్స్ రైలు..
మధ్యప్రదేశ్ ఎల్పీజీతో వెళ్తోన్న గూడ్స్ రైలుకు మంగళవారం (జూన్ 6) రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. జబల్‌పూర్ జిల్లాలోని భారత్ పెట్రోలియంకు చెందిన ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్లను ఖాళీ చేయడానికి వెళుతున్న గూడ్స్ రైలు నుంచి రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. వెంటనే గమనించిన..
మధ్యప్రదేశ్ ఎల్పీజీతో వెళ్తోన్న గూడ్స్ రైలుకు మంగళవారం (జూన్ 6) రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. జబల్‌పూర్ జిల్లాలోని భారత్ పెట్రోలియంకు చెందిన ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్లను ఖాళీ చేయడానికి వెళుతున్న గూడ్స్ రైలు నుంచి రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. వెంటనే గమనించిన డ్రైవర్ రైలును ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. జబల్ పూర్ జిల్లాలోని షాపురా భిటోని స్టేషన్‌లోని భారత్ పెట్రోలియం డిపో సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు మంగళవారం అర్థరాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు.
వేరు ఘటనల్లో పలు చోట్ల తప్పిన రైలు ప్రమాదాలు..
న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 22812) వెళుతున్న సమయంలో సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో రైల్వే గేట్‌ను ట్రాక్టర్ ఢీకొంది. ట్రాక్టర్ రైల్వే ట్రాక్, గేట్ మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే ట్రైన్‌ను ఆపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బొకారో జిల్లాలోని భోజుడిహ్ రైల్వే స్టేషన్ సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగింది.
మంగళవారం రాత్రి కాచిగూడ నుంచి బెంగళూరుకు బయల్దేరిన బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ రైల్వేస్టేషన్ వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో రైలు చక్రాల్లో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ఒడిశాలోనే బొగ్గు తీసుకువెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్ రాష్ట్రంలో మరో పెద్ద రైలుకు ప్రమాదం తప్పింది.
#WATCH | Two wagons of LPG rake of a goods train derailed while being placed for unloading last night in Shahpura Bhitoni, Jabalpur of Madhya Pradesh. Train movement is normal in main line. Restoration work started after sunrise in the presence of siding authorities. Fitness… pic.twitter.com/F2StcFHDFi
— ANI (@ANI) June 7, 2023
ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటన తర్వాత వరుస ఘటనలు జరుగుతుండటంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.