Covid-19 Alert: దేశంలోని 37 జిల్లాల్లో పెరుగుతున్న రోజువారీ కేసులు.. ఏపీలోనూ ఆ రెండు జిల్లాల్లో..
India Covid-19 News: దేశంలోని 37 జిల్లాల్లో రోజువారీ కొవిడ్ కేసులు గత రెండు వారాలుగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీలోని రెండు జిల్లాలు కూడా ఉన్నాయి.

దేశాన్ని కోవిడ్ థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. సెప్టెంబర్ మాసం నుంచి థర్డ్ వేవ్ మొదలుకావచ్చని కొందరు వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. అటు దేశంలో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తదితర కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గత రెండు వారాలుగా దేశంలో 9 రాష్ట్రాల్లోని 37 జిల్లాల్లో రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ షాకింగ్ విషయాలు వెల్లడించింది. కేరళలోని 11 జిల్లాల్లో గత రెండు వారాలుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే తమిళనాడులో 7 జిల్లాలు, హిమాచల్ ప్రదేశ్‌లో ఆరు జిల్లాలు, కర్ణాటకలో 5 జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాల్లోనూ గత రెండు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే మహారాష్ట్రలో రెండు జిల్లాలు, పశ్చిమ బెంగాల్‌లో రెండు జిల్లాల్లోనూ కరోనా కేసులు అదుపులోకి రావడం లేదు. మేఘాలయలోని ఒక జిల్లాలోనూ..మిజోరంలో ఒక జిల్లాలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
? Districts showing an increasing trend in average daily cases
– JS, @MoHFW_INDIA #Unite2FightCorona #StaySafeStayHealthy pic.twitter.com/HXfH5QfNqC
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) August 10, 2021
దేశంలో యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లో ఎక్కువ.. అటు దేశంలో ప్రస్తుతం అత్యధికంగా యాక్టివ్ కరోనా కేసులున్న 9 రాష్ట్రాల జాబితాను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దేశంలో ఒక రాష్ట్రం(కేరళ)లో లక్షకు పైగా యాక్టివ్ కేసులుండగా.. 10 వేల నుంచి 1 లక్ష వరకు 8 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులున్నాయి. 10 వేలకంటే తక్కువ యాక్టివ్ కేసులు 27 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా కేరళలో 1,77,091 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 43.77 శాతం కావడం అక్కడి కరోనా ఉధృతిని తేటతెల్లంచేస్తోంది. అలాగే మహారాష్ట్రలో 74,944 యాక్టివ్ కేసులు (18.48శాతం) ఉండగా.. కర్ణాటక(23,956), తమిళనాడు(20,407) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 19,949 యాక్టివ్ కేసులు(దేశంలో 5.03శాతం) ఉన్నాయి. మిజోరం, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలోనూ 10 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.
?India snapshot – State wise Active Cases
– JS, @MoHFW_INDIA #Unite2FightCorona #StaySafeStayHealthy pic.twitter.com/ydbG9oeH4J
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) August 10, 2021
Also Read..
ఏపీలో కాస్త పెరిగిన పాజిటివ్ కేసులు, తగ్గిన మరణాలు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే!
