Viral Video: మోకాలి లోతు బురదలో మంచంపై గర్బిణీని ఆస్పత్రికి మొసుకెళ్తున్న దృశ్యం.. వీడియో వైరల్
Viral Video: దేశంలో అభివృద్ధి చెందని ప్రాంతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకునే రోజుల్లో కూడా సరైన రోడ్లు కూడా లేని రాష్ట్రాలు..

Viral Video: దేశంలో అభివృద్ధి చెందని ప్రాంతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకునే రోజుల్లో కూడా సరైన రోడ్లు కూడా లేని రాష్ట్రాలు ఇప్పటికి మనకు కనిపిస్తుంటాయి. ఉన్న టెక్నాలజీతో దేశాలు అభివృద్ధి చెందుతుంటే .. కొన్ని రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందక ప్రజలు నరకయాతన పడుతున్నారు. గ్రామాలకు సరైన రోడ్లు లేక, బురద నడుచుకుంటూ కష్టాలు పడుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని కరౌలి ప్రాంతంలో ఓ గర్బిణీకి పురిటి నొప్పులు రావడంతో సరైన రవాణా సౌకర్యం లేక ఆమెను మంచంపై ఎత్తుకుని బురద నీటిలో వెళ్తున్న దృశ్యాలు అభివృద్దికి అద్దం పడుతోంది. ఏదైనా ఆరోగ్యం బారిన పడితే సరైన రోడ్డు లేక ఇలా బురదలో నరకం అనుభవించాల్సిన దుస్థితి నెలకొంది. వర్షం కురిసిందంటే చాలు.. బురదలో రాకపోకలు కొనసాగించాల్సి వస్తోంది. ఇలా గర్బిణీ స్త్రీని మోకాలి లోతులో నిండిన బురద మార్గాన్ని దాటుతుండటం అందరిని కలచివేస్తోంది. ఇలా సరైన రోడ్డు, వంతెనలు లేక ఎన్నో గ్రామాల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
