AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయ ప్రక్షాళనపై సుప్రీంకోర్టు సీరియస్..బీజేపీ, కాంగ్రెస్ సహా 9 పార్టీలకు జరిమానా

దేశంలో నేరగ్రస్త రాజకీయాలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించిన సుప్రీంకోర్టు దీనిపై మరింత దృష్టి సారించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది తాము జారీ చేసిన ఉత్తర్వులను పాటించకుండా ధిక్కరించినందుకు తొమ్మిది పార్టీలకు జరిమానా విధించింది.

రాజకీయ ప్రక్షాళనపై సుప్రీంకోర్టు సీరియస్..బీజేపీ, కాంగ్రెస్ సహా 9 పార్టీలకు జరిమానా
Supreme Court
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 10, 2021 | 6:40 PM

Share

దేశంలో నేరగ్రస్త రాజకీయాలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించిన సుప్రీంకోర్టు దీనిపై మరింత దృష్టి సారించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది తాము జారీ చేసిన ఉత్తర్వులను పాటించకుండా ధిక్కరించినందుకు తొమ్మిది పార్టీలకు జరిమానా విధించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు, మరో 5 పార్టీలకు లక్ష రూపాయల చొప్పున, సీపీఎం. ఎన్సీపీలకు 5 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను విధిగా ప్రచురించాలని ఆయా పార్టీలను కోర్టు లోగడ ఆదేశించింది. అయితే ఇవి ఆ ఉత్తర్వులను పాటించక పోవడం కోర్టు ధిక్కారమే అవుతుందంటూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.వీటిని విచారించిన కోర్టు మంగళవారం ఈ చర్య తీసుకుంది. భవిష్యత్తులో తమ అభ్యర్థుల నేర ఛరిత్రను తమ వెబ్ సైట్లలో ప్రచురించడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించింది. అలాగే ఓటర్లకు సులభంగా అందుబాటులో ఉండేట్టు ఓ మొబైల్ యాప్ ను క్రియేట్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పాలిటిక్స్ లో నేరగాళ్లకు చోటులేకుండా చూసేందుకు ఇది అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న అత్యంత ప్రధాన చర్య అంటున్నారు. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయగోరిన అభ్యర్థులు 48 గంటల్లో గానీ, తమ నామినేషన్ల దాఖలుకు రెండు వారాల్లోగా గానీ తమ నేరాల చిట్టాను బహిర్గతపరచాలని కోర్టు నాడు ఆదేశించినప్పటికీ.. ప్రస్తుతం దీన్ని 48 గంటలకు కుదించింది.

తమ అభ్యర్థుల నేర చరిత్రను ప్రకటించని పార్టీల ఎన్నికల చిహ్నాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ని కూడా కోర్టు విచారించింది. క్రిమినల్ కేసులున్నవారిని అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారో సంజాయిషీ ఇవ్వాలని సైతం కోర్టు కోరింది. ఇందుకు కారణాలను ఆయా పార్టీలు తమ వెబ్ సైట్లలో పేర్కొనాలని ఆదేశించింది. కాగా బీహార్ ఎన్నికల సందర్భంలో తమ క్యాండిడేట్ల క్రిమినల్ చరిత్రను వెల్లడించనందుకు బేషషరతుగా తమను క్షమించాలంటూ సీపీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ .. కోర్టును కోరాయి. కోర్టు ఆదేశాల మేరకు వీటి ఎన్నికల చిహ్నాలను రద్దు చేస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చూడండి : Taliban Live Video: తాలిబన్లు ఘాతుకం.. బిగుతుగా డ్రెస్ వేసుకుందని మహిళ హతం..

 ‘మా‘ పాలిటిక్స్‌కు ‘మెగా’ టచ్..!ప్రస్తుత పరిణామాలపై చిరు సీరియస్..క్రిష్ణంరాజుకు లేఖ..:MAA Elections Controversy Live Video.

 వంటలక్క ఇంట బర్త్‌డే హంగామా..!సందడి చేసిన డాక్టర్ బాబు..ఇంతకీ బర్త్ డే ఎవరిదో తెలుసా..:Karthikadeepam vantalakka Video.

 బైక్‌ షోరూమ్‌లో స్మార్ట్‌ దొంగలు.. వీళ్ల తెలివికి ఆస్కార్‌ ఇచ్చినా తక్కువే.!షాక్ లో ఓనర్స్..:Smart thieves in bike showroom Video.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!