Child Marriage: మన దేశంలో నిమిషానికి 3 బాల్య వివాహాలు.. బాలికలకు బలవంతం పెళ్ళిళ్ళు… అధ్యయనంలో షాకింగ్ విషయాలు

భారతదేశంలో బాల్య వివాహాలు మొదటిసారిగా 1929లో నిషేధించబడ్డాయి. అనేక సందర్భాల్లో ఈ చట్టం మరింత మెరుగు పడుతూ వచ్చింది. అయినప్పటికీ ఈ డేటా ఆధారంగా చూస్తే నేటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది జాతీయ అవమానంగా కొంతమంది భావించడమే కాదు.. తీవ్ర ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు. బాల్య వివాహాలను అరికట్టడం వలన మాతాశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

Child Marriage: మన దేశంలో నిమిషానికి 3 బాల్య వివాహాలు.. బాలికలకు బలవంతం పెళ్ళిళ్ళు... అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Child Marriage
Follow us
Surya Kala

|

Updated on: Jul 18, 2024 | 9:27 AM

మనిషి ఆధునిక కాలంలో జీవిస్తున్నాడు. ఆకాశాన్ని తరచి చూస్తున్నాడు.. జాబిలమ్మ మీద అడుగు పెట్టాడు.. సముద్రం లోతులు కొలుస్తున్నాడు. అయినప్పటికీ కొన్ని మూఢాచారాలను నేటికీ కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎన్ని కొత్త చట్టాలను తీసుకోస్తున్నా తాము నమ్మిన దానిని కొంతమంది అమలు చేయడంలో ఎటువంటి వెనకడుగు వేయడం లేదు. ఆలాంటి మూఢాచారాల్లో ఒకటి బాల్య వివాహం. మన దేశంలో ప్రతి నిమిషానికి ముగ్గురు ఆడపిల్లలకు బలవంతంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. దేశంలో జరిగే బాల్య వివాహాల గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బలవంతపు పెళ్ళిళ్ళ విషయంలో 2022 లెక్కల దేశవ్యాప్తంగా రోజుకు మూడు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అయితే వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉందని కొత్త అధ్యయనం ద్వారా తెలుస్తోంది. పౌర సమాజ సంస్థల ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా’ నెట్‌వర్క్‌లో భాగమైన ‘ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్’ రీసెర్చ్ టీమ్ చేసిన కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB), నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (2019-21) డేటాను విశ్లేషించి ఈ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం 2018 నుంచి 2022 మధ్య సంవత్సరాల్లో 3,863 బాల్య వివాహాలు జరిగినట్లు NCRB నమోదు చేసింది. అయితే ఈ అధ్యయనం ఎత్తి చూపినట్లుగా.. జనాభా లెక్కల అంచనాల ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం 16 లక్షల బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఒక కేస్ స్టడీ అస్సాం

ఇవి కూడా చదవండి

అయితే గత 3 సంవత్సరాలలో ఈ బాల్య వివాహాలు జరగడంలో తగ్గుదల కనిపిస్తోంది. 81% తగ్గుదలని చూపిస్తోంది. బాల్య వివాహాలను అరికట్టడంలో అస్సాం ఒక కేస్ స్టడీగా NCRB సంస్థ ఎన్నుకుంది. NFHS-5 అంచనాల ప్రకారం ప్రస్తుతం 20 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 23.3% స్త్రీలు 18 సంవత్సరాల వయసు కంటే ముందే వివాహం చేసుకున్నారు. NFHS నివేదిక ప్రకారం, 2021-22 మరియు 2023-24 మధ్య అస్సాం రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 1,132 గ్రామాల్లో బాల్య వివాహాలు 81% మేర తగ్గాయి. 2021-20 22 ఏడాదిలో బాల్య వివాహాలకు సంబంధించిన కేసులు 3,225 నమోదు కాగా.. 2023 – 2024లో ఈ బాల్య వివాహాల సంఖ్య 627లుగా నమోదయింది. గత ఏడాది బాల్య వివాహం జరిపించిన నేరానికి సంబంధించి 3,000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఈ గ్రామాలలో నిర్వహించిన ఒక సర్వేలో 98% మంది ప్రజలు బాల్య వివాహాల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ముఖ్య కారణం రాష్ట్రంలోని కఠినమైన చట్టాల అమలు చేయడం అని అభిప్రాయపడ్డారు.

బాల్య వివాహాలపై ఎప్పటి నుంచి నిషేధం అంటే..

భారతదేశంలో బాల్య వివాహాలు మొదటిసారిగా 1929లో నిషేధించబడ్డాయి. అనేక సందర్భాల్లో ఈ చట్టం మరింత మెరుగు పడుతూ వచ్చింది. అయినప్పటికీ ఈ డేటా ఆధారంగా చూస్తే నేటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది జాతీయ అవమానంగా కొంతమంది భావించడమే కాదు.. తీవ్ర ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు. బాల్య వివాహాలను అరికట్టడం వలన మాతాశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, లింగ సమానత్వాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006ను సవరించేందుకు ఉద్దేశించిన 2021 బిల్లును మళ్ళీ కొత్తగా చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.

అయితే దీనిని వాస్తవ దృష్టితో చూస్తే.. నిజం ఏమిటంటే సామాజిక అనుమతి లేకుండా ఎటువంటి చట్టాలు మనుగడ సాగించలేవు. అందుకే ప్రజలకు అవగాన కలిగేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు బాల్య వివాహాలను అరికట్టే మిషన్‌లో పనిచేయాలి

దేశంలో వివిధ ప్రాంతాల్లో బాల్య వివాహాలకు గల కారణాలు భిన్నంగా ఉన్నాయి. అదే విధంగా కేసు విచారణ విషయంలో కూడా కోర్టు పని తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. 2022లో బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కోర్టుల్లో విచారణ కోసం మొత్తం 3,563 కేసులు కోర్టు మెట్లు ఎక్కాగా.. వీటిల్లో కేవలం 181 కేసుల విచారణను మాత్రమే కోర్టు విజయవంతంగా పూర్తి చేసింది. అంటే కేసు పెండెన్సీ రేటు 92% ఉండగా నేరారోపణ రేటు 11%. ఉంది.

వివిధ NGO సంస్థలు బాల్య వివాహాల డేటాను విశ్లేషిస్తూ “బాల్య వివాహాలలో ఎక్కువ భాగం ఆడపిల్లల దుర్బలత్వాన్ని ఉపయోగించుకునే సందర్భాలు ఎక్కువ అని చెప్పాయి. అంతేకాదు వృద్ధులు తమ అధికారాన్ని అమ్మాయిల దుర్బలత్వాన్ని ఉపయోగించుకుంటున్నారని వెల్లడించాయి.

మరిన్ని హ్యూమన్ ఇంటరెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..