Viral Video: రైతు అంటే అంత అలుసా..? ముందు పైత్యం ప్రదర్శించి.. ఆపై బుద్ది తెచ్చుకుని
బెంగళూరులోని GTమాల్‌లో రైతుకు అవమానం జరిగింది. సినిమా చూసేందుకు వెళ్లిన రైతును సెక్యూరిటీ అడ్డుకున్నారు. లోకల్ కన్నడిగులు ఆగ్రహించండంతో మాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది.
బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పంచెకట్టులో కల్కి సినిమా చూడటానికి వచ్చిన ఓవృద్ధుడిని GTమాల్ లోనికి రానివ్వలేదు. ప్యాంట్ వేసుకొని వస్తేనే అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది రైతును అవమానించారు. టికెట్లు బుక్ చేసుకున్నామని ఆయన కొడుకు ఎంత నచ్చజెప్పినా భద్రతా సిబ్బంది వినలేదు. తన తండ్రి దూర ప్రాంతం నుంచి వచ్చారని, అప్పటికప్పుడు దుస్తులు మార్చుకునే సమయం దొరకలేదని, అందుకే అలాగే వచ్చామని చెప్పినప్పటికీ సిబ్బంది వినిపించుకోలేదు. చేసేందేమీ లేక తండ్రి కొడుకులు వెనుతిరిగారు. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జీటీ మాల్ యాజమాన్యంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వృద్ధుడికి ఇచ్చే గౌరవం ఇదా? అంటూ కామెంట్ చేశారు. ఈ ఘటనపై కొందరు కన్నడ లోకల్స్ నిరసన తెలిపారు. ఫక్తు కన్నడ వాసులను అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బీజేపీ సైతం తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పంచెకట్టు ధరించినందుకు రైతులను తిట్టడం, అవమానించడం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి ధోవతి ధరిస్తారు కానీ… మాల్‌లోకి రైతును ధోవతితో అనుమతించరా? అంటూ ప్రశ్నించింది.
ఈ పరిణామాలతోజీటీ మాల్ యాజమాన్యం దిగొచ్చింది. వెంటనే వృద్ధుడు ఫకీరప్పకు క్షమాపలు చెప్పింది. ఆయనను దగ్గరుండి తీసుకెళ్లి మాల్‌కి తీసుకెళ్లి.. మాల్‌లో గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది. పూలమాలవేసి.. శాలువా కప్పి సన్మానం చేసింది మాల్ యాజమాన్యం. గతంలోనూ రాజాజీనగర్ మెట్రోలో ఓ రైతు పట్ల మెట్రో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. వేషధారణ బాగోలేదని మెట్రోలోకి అనుమతించలేదు సిబ్బంది. ఫైనల్‌గా నిరసనలు వెల్లువెత్తడంతో క్షమాపణ చెప్పింది మెట్రో సిబ్బంది.
A farmer wearing a Panche (Vesti) was not allowed to enter GT Mall in Bengaluru as his dress was 'inappropriate'. Asked to wear Pants. Few months ago, Virat Kohli's One-8 commune in Mumbai did the same. Shameful incident pic.twitter.com/tmRggT5ijS
— Sharan Poovanna (@sharanpoovanna) July 17, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..