AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Branches: 2118 బ్యాంక్‌ బ్రాంచ్‌లు మూసివేత.. అసలు కారణం ఇదే.. కీలక విషయాన్ని ప్రకటించిన ఆర్బీఐ

Bank Branches: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక విషయాన్ని ప్రకటించింది. సమాచార హక్కు చట్టం (RTI) కింద ఒక అంశాన్ని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో..

Bank Branches: 2118 బ్యాంక్‌ బ్రాంచ్‌లు మూసివేత.. అసలు కారణం ఇదే.. కీలక విషయాన్ని ప్రకటించిన ఆర్బీఐ
Reserve Bank of India
Subhash Goud
|

Updated on: May 11, 2021 | 6:24 AM

Share

Bank Branches: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక విషయాన్ని ప్రకటించింది. సమాచార హక్కు చట్టం (RTI) కింద ఒక అంశాన్ని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2118 బ్యాంక్ బ్రాంచులు మూసివేసినట్లు తెలిపింది. ఈ బ్యాంకు బ్రాంచులు శాశ్వతంగా మూసివేసే అవకాశం ఉంది. లేదంటే ఇతర బ్యాంకు బ్రాంచ్‌లుగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. బ్యాంకుల విలీనం కారణంగా ఈ స్థాయిలో బ్యాంక్ బ్రాంచులు క్లోజ్ కావడం గమనార్హమని చెప్పుకోవచ్చు. ఈ 2118 బ్రాంచుల్లో ఏ బ్యాంక్ బ్రాంచులు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం.

బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1283 బ్రాంచులు ఉండగా, దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 332 బ్రాంచులు ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు (PNB) 169 బ్రాంచులు ఉండగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 124 బ్రాంచులను, కెనరా బ్యాంక్ 107 బ్రాంచులను, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 53 బ్రాంచులను, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 43 బ్రాంచులను, ఇండియన్ బ్యాంక్ 5 బ్రాంచులు ఉన్నాయి.

కాగా, కేంద్ర సర్కార్‌ గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ పది బ్యాంకులు 4 బ్యాంకులుగా ఆవిర్భవించాయి. దీంతో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు దిగివచ్చింది. కాగా బ్యాంకుల విలీనం వల్ల బ్రాంచులు తగ్గడం బ్యాంకింగ్ వ్యవస్థకు మంచిది కాదని, ఉపాధి తగ్గుతుందనే వాదనలు కూడా ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి:

One Rupee Note: మీ వద్ద రూపాయి నోటు ఉందా.? అయితే మీరు కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే..!

Income Tax: బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నారా..? అయితే జాగ్రత్త.. ఐటీ నోటీసులు వచ్చే 5 రకాల లావాదేవీలు ఇవే..!

LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకు ముఖ్య గమనిక.. నేటి నుంచి కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..!