Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robbery: విమానంలో వెళ్లి 10.72 లక్షలు చోరీ చేశారు.. చివరికి

ప్రపంచవ్యాప్తంగా దొంగతానలు జరగని అంటూ దేశం ఉండదు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇళ్లల్లో, బస్‌ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లనో ఎక్కువగా దొంగతనాలు జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో చివరకి ఏటీఎంలలో కూడా దొంగతనాలు చేయడం పెరిగిపోయింది. ఏటీయంను పగలగొట్టి డబ్బులు దొంగిలిస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు నిందితులను అరెస్టు చేసి.. శిక్షించినా కూడా అలాంటి దొంగతనాలు ఇంకా ఆగడం లేదు. ఈ ఇంటర్నెట్ యుగంలో.. ఇప్పుడు సైబర్ క్రైమ్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అనేకమంది అమాయకులు.. వేలు, లక్షలు, కోట్ల రూపాయలు కూడా సైబర్ నేరగాళ్లకు కట్టబెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

Robbery: విమానంలో వెళ్లి 10.72 లక్షలు చోరీ చేశారు.. చివరికి
Atm
Follow us
Aravind B

|

Updated on: Oct 01, 2023 | 7:43 PM

ప్రపంచవ్యాప్తంగా దొంగతానలు జరగని అంటూ దేశం ఉండదు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇళ్లల్లో, బస్‌ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లనో ఎక్కువగా దొంగతనాలు జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో చివరకి ఏటీఎంలలో కూడా దొంగతనాలు చేయడం పెరిగిపోయింది. ఏటీయంను పగలగొట్టి డబ్బులు దొంగిలిస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు నిందితులను అరెస్టు చేసి.. శిక్షించినా కూడా అలాంటి దొంగతనాలు ఇంకా ఆగడం లేదు. ఈ ఇంటర్నెట్ యుగంలో.. ఇప్పుడు సైబర్ క్రైమ్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అనేకమంది అమాయకులు.. వేలు, లక్షలు, కోట్ల రూపాయలు కూడా సైబర్ నేరగాళ్లకు కట్టబెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇలాంటి మోసాలకు బలైపోతున్నారు. అంతేకాదు ఉద్యోగాలు చేసేవాళ్లు, సాఫ్ట్‌వేర్ కొలువులు చేసేవాళ్లు కూడా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుతున్నారు.

అయితే తాజాగా ఇద్దరు వ్యక్తులు ఒక ఏటీయం నుంచి ఏకంగా 10 లక్షల 72 వేల రూపాయలు చోరీ చేయడం కలకలం రేపుతోంది. అంతేకాదు ఈ దొంగతనం చేసిన తర్వాత వాళ్లు విమానంలో ప్రయాణించి మరో ప్రాంతానికి వెళ్లారు. అయితే విచారణ చేసినటువంటి పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గత నెలలో అమ్రైవాడి ప్రాంతంలోని ఏటీఎంను దొంగలు పగలగొట్టారు. అనంతంరం ఆ ఏటీయంలో ఉన్నటువంటి 10 లక్షల 72 లక్షల విలువైన నోట్ల కట్టలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీ జరిగిన సంగతి అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వారు ఈ చోరీపై విచారణ జరిపారు. అయితే పంజాబ్‌కు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు చండీగఢ్‌ నుంచి విమానంలో అహ్మదాబాద్‌కు వచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డారని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్‌ అయిపోయారు.

ఇదిలా ఉండగా.. ఆ ఇద్దరు నిందితులు నకిలీ ఆధార్‌కార్డులతో అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఉన్నటువంటి ఓ హోటల్‌ బుక్‌ చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్‌‌లో ద్విచక్ర వాహనం, గ్యాస్‌ కట్టర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లను కొన్నట్లు పేర్కొన్నారు. అలాగే గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఎంపిక చేసినటువంటి ఏటీఎంను పగులగొట్టి అందులో ఉన్నటువంటి 10.72 లక్షల రూపాయల నగదును దోచుకొని వెళ్లారని పేర్కొన్నారు. అయితే ఈ చోరీ జరిగిన అనంతరం విమానంలో ఢిల్లీకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు చూసుకుంటే అరెస్ట్‌ చేసిన ఈ ఇద్దరు నిందితుల్లో ఒకరైన అమర్‌జోత్ సింగ్ అరోడా 2005లో ఒక హత్య కేసులో కూడా మొహాలీ అనే ప్రాంతంలో అరెస్టైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే 2010 లో బెయిల్‌పై విడుదలైన అమర్‌జోత్ ఈ ఏడాది ఏప్రిల్, జూన్‌లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పూణేలో ఏటీఎంలను తెరిచేందుకు ప్రయత్నించాడని.. కానీ చివరికి పట్టుబడినట్లు పేర్కొన్నారు. అంతేకాదు బెంగుళూరులో కూడా హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి నాలుగు వేరువేరు కేసులు సైతం అతడిపై నమోదయ్యాయని తెలిపారు. ఈ నిందితులిద్దరూ కూడా విమానాల్లో ప్రయాణిస్తూ ఏటీఎంలు చోరీ చేస్తుంటారని పోలీసులు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.