యూపీ, కర్ణాటకలో చెలరేగిన హింస.. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా యూపీ, కర్ణాటకలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్ణాటకలోని మంగళూరులో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. లక్నోలో జరిగిన నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో […]
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా యూపీ, కర్ణాటకలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్ణాటకలోని మంగళూరులో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు.
ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. లక్నోలో జరిగిన నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఇదిలావుంటే.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద.. 1200 మంది నిరసనను వ్యక్తం చేశారు. ఏర్రకోట సమీపంలో ఈ పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. దీంతో సమీప ప్రాంతాల్లో144సెక్షన్‌ను విధించారు.