AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సుప్రీం’కు దిశ నిందితుల కుటుంబాలు.. రూ.50లక్షలు ఇవ్వాలంటూ..!

ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలకు ఇంకా అంత్యక్రియలు పూర్తి కాలేదు. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిందితుల అంత్యక్రియలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఎన్‌కౌంటర్‌పై దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వారు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు నిందితులను నకిలీ ఎన్‌కౌంటర్ చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక కోర్టు వేసిన […]

'సుప్రీం'కు దిశ నిందితుల కుటుంబాలు.. రూ.50లక్షలు ఇవ్వాలంటూ..!
Ravi Kiran
|

Updated on: Dec 20, 2019 | 5:56 AM

Share

ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలకు ఇంకా అంత్యక్రియలు పూర్తి కాలేదు. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిందితుల అంత్యక్రియలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఎన్‌కౌంటర్‌పై దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వారు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసులు నిందితులను నకిలీ ఎన్‌కౌంటర్ చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక కోర్టు వేసిన విచారణ కమిషన్‌కు అందించే సాక్ష్యాలు తారుమారు చేయకుండా సీపీ సజ్జనార్ సహా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని పిటిషనర్లు కోరారు. అలాగే సీపీ సజ్జనార్ సహా ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై విచారణ కమిషన్ ఆధ్వర్యంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని వారు న్యాయస్థానానికి విన్నవించారు. అంతేకాకుండా ఒక్కో కుటుంబానికి పరిహారంగా 50 లక్షలు ఇవ్వాలని నిందితుల కుటుంబాలు తమ పిటిషన్‌లో పేర్కొనడం గమనర్హం.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే