Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ముకేశ్ అంబానీకి బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్న తెలంగాణ వ్యక్తి అరెస్ట్

ముకేశ్ అంబానీ సిమ్ కార్టు మొదలు డిజిటల్ రంగం వరకూ.. ఆయిల్ ఉత్పత్తుల నుంచి ఐస్ క్రీం సంస్థల వరకూ అన్నింటా తానే దేదీప్యమానంగా వెలుగొందుతూ భారత కుబేరుల జాబితాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వరుస మెయిల్స్ ద్వారా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు కొందు ఆకతాయిలు. డబ్బులు ఇవ్వాలని లేకుంటా చంపేస్తామని సందేశాన్ని పంపించారు. మొదట దీనిని లైట్‌గా తీసుకున్నారు. అయితే క్రమంగా మెయిల్స్ ద్వారా

Mukesh Ambani: ముకేశ్ అంబానీకి బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్న తెలంగాణ వ్యక్తి అరెస్ట్
19 Year Old Telangana Man Arrested For Threatening Mukesh Ambani Through Email
Follow us
Srikar T

|

Updated on: Nov 04, 2023 | 6:20 PM

ముకేశ్ అంబానీ సిమ్ కార్టు మొదలు డిజిటల్ రంగం వరకూ.. ఆయిల్ ఉత్పత్తుల నుంచి ఐస్ క్రీం సంస్థల వరకూ అన్నింటా తానే దేదీప్యమానంగా వెలుగొందుతూ భారత కుబేరుల జాబితాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వరుస మెయిల్స్ ద్వారా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు కొందు ఆకతాయిలు. డబ్బులు ఇవ్వాలని లేకుంటా చంపేస్తామని సందేశాన్ని పంపించారు. మొదట దీనిని లైట్‌గా తీసుకున్నారు. అయితే క్రమంగా మెయిల్స్ ద్వారా బెదిరింపుల తీవ్రత పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ అసాంఘీక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు తెలంగాణకు చెందిన యువకుడిని ముంబైలోని గామ్‌దేవి పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. షాదాబ్ ఖాన్ అనే మారుపేరుతో నిందితుడు గణేష్ రమేష్ వనపర్ద్ అనే 19ఏళ్ల కుర్రాడు తొలిసారిగా అక్టోబర్ 27న ముఖేష్ అంబానీకి ఈ-మెయిల్ పంపాడు. 20 కోట్ల రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ, “మీరు (అంబానీ) మాకు రూ. 20 కోట్లు ఇవ్వకపోతే, మేము నిన్ను చంపుతాము అని సందేశాన్ని పంపాడు. భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు” అని రాశాడు. దీనిపై స్పందించని ముకేశ్ అంబానీకి ఇమెయిల్ బెదిరింపుల తీవ్రత పెరిగింది.

అతను మరిన్ని ఇమెయిల్‌లు పంపుతూనే ఉన్నాడు. మరోసారి రూ. 200 కోట్లు డిమాండ్ చేశాడు. మరోసారి ప్రాణాలు తీస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు.ఇలా వరుస సందేశాలతో నిందితులు ఈ డిమాండ్‌ని రెట్టింపు చేస్తూ వచ్చాడు. ఈ వారంలో రూ. 400 కోట్ల డిమాండ్ వద్ద ఆగిపోయాడు. ఈ 19 ఏళ్ల యువకుడి ఐపీ అడ్రస్‌లను మహారాష్టరాలోని గాందేవి పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి నవంబర్ 1 వరకు పోలీసు కస్టడీకి పంపారు. బెదిరింపు ఇమెయిల్‌లను పోలీసులు చాలా చిన్నవిగా భావిస్తారు. అయితే ఈ ఇమెయిల్‌ ద్వారా పెద్ద ఎత్తున వరుసగా బ్లాక్‌మెయిల్ మెసేజ్‌లు పంపడంతో రంగంలోకి దిగిన పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అయితే ఒక అనాలోచిత చిలిపి పనిపై ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..