Watch Video: ఢిల్లీలో బస్సు బీభత్సం.. రోడ్డుపై వాహనాలు నుజ్జునుజ్జు.. షాకింగ్ వీడియో
దేశ రాజధాని ఢిల్లీలో బస్సు బీభత్సం సృష్టించింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కి చెందిన బస్సు అదుపు తప్పి కారు, రెండు బైకులు, రిక్షాను ఢీకొంది. రోడ్డుపై నడుస్తున్న వాహనాలతో పాటు రోడ్డు పక్క ఆపిన బైక్‌లపై బస్సు దూసుకెళ్లింది. రోహిణి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బస్సు బీభత్సం సృష్టించింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కి చెందిన బస్సు అదుపు తప్పి కారు, రెండు బైకులు, రిక్షాను ఢీకొంది. రోడ్డుపై నడుస్తున్న వాహనాలతో పాటు రోడ్డు పక్క ఆపిన బైక్‌లపై బస్సు దూసుకెళ్లింది. రోహిణి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

