Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job CV: జాబ్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థి.. దరఖాస్తులో వ్యక్తిగత విషయాలు చూసి షాకైన సంస్థ

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పెద్ద సంస్థల్లో పనిచేయాలని అనుకునే వారే అధికంగా ఉన్నారు. చిన్న పాచి పని అయినా పెద్ద సంస్థలో చేస్తే చెప్పుకోవడానికి అదేదో గొప్పగా ఉంటుందని ఫీలైపోతూ ఉంటారు. దీనికి అనుగుణంగా కార్పొరేట్ సంస్థలు ఇంటర్వూకి వచ్చే ముందు ఆ వ్యక్తి గురించి ప్రాధమిక సమాచారం కోసం కరికులం విటే (CV)ని తీసుకుంటుంది. ఇందులో అతని పేరు, వయసు మొదలు వృత్తికి సంబంధించిన అనుభవం, అతనికి ఉన్న ప్రత్యేకమైన స్కిల్స్‌ను పరిగణలోకి తీసుకుంటుంది.

Job CV: జాబ్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థి.. దరఖాస్తులో వ్యక్తిగత విషయాలు చూసి షాకైన సంస్థ
Candidate Submits His Sperm Count Details In His Resume Applied For A Job In Walnut Company
Follow us
Srikar T

|

Updated on: Nov 04, 2023 | 6:23 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పెద్ద సంస్థల్లో పనిచేయాలని అనుకునే వారే అధికంగా ఉన్నారు. చిన్న పాచి పని అయినా పెద్ద సంస్థలో చేస్తే చెప్పుకోవడానికి అదేదో గొప్పగా ఉంటుందని ఫీలైపోతూ ఉంటారు. దీనికి అనుగుణంగా కార్పొరేట్ సంస్థలు ఇంటర్వూకి వచ్చే ముందు ఆ వ్యక్తి గురించి ప్రాధమిక సమాచారం కోసం కరికులం విటే (CV)ని తీసుకుంటుంది. ఇందులో అతని పేరు, వయసు మొదలు వృత్తికి సంబంధించిన అనుభవం, అతనికి ఉన్న ప్రత్యేకమైన స్కిల్స్‌ను పరిగణలోకి తీసుకుంటుంది. తద్వారా ఆ వ్యక్తి తన సంస్థకు ఉపయోగపడతాడా లేదా అన్న విషయంపై ఒక అవగాహనకు వస్తుంది. ప్రస్తుతం ఏ సంస్థ అయినా మంచి టాలెంట్ కలిగిన అభ్యర్థులను తీసుకోవాలని కోరుకుంటుంది. అయితే న్యూయార్క్‌కు చెందిన వాల్‌నట్ అనే హెల్త్ కేర్ కంపెనీ సీఈవోకు ఒక విచిత్రమైన సీవీ వచ్చింది. ఈ సీవీ చదివిన సీఈవో ఆశ్చర్యపోడారు. ఇంతకూ ఆ సీవీలో ఏమి రాసి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన ప్రముఖ కార్పొరేట్ సంస్థ వాల్‌నట్ హెల్త్ కేర్ సీఈవోకి వచ్చిన సీవీ చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. సాధారణంగా సీవీలో వ్యక్తిగత అనుభవాన్ని ఎక్కువగా చూపించుకుంటారు. లేకుంటే తనకు వచ్చిన నైపుణ్యాలకు ఒక రెండు అదనంగా జోడించి చూపిస్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టాడు. ఈ సీవీని ఏకంగా సంస్థ సీఈవో (@roshanpateI) ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌కు లింక్ చేశాడు. తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలను చూసిన సంస్థ అధినేత షాక్‌కి గురయ్యారు. ఇలాంటివి కూడా రాస్తారా అని కంగుతిన్నారు. అతను తన స్పెర్మ్ కౌంట్ 800 మిలియన్ అని పేర్కొన్నాడు. ఈ అంశం చూసేందుకు చాలా కొత్తగా వింతగా కనిపిస్తుంది. అసలు ఈ విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఏముందనుకుంటున్నారు కొందరు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇప్పటికే 2మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన కామెంట్లను సందిస్తున్నారు. అతను ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నాడో.. అని వ్యంగంగా స్పందించారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు రక్తం గ్రూపులు, బ్లెడ్ సెల్స్, ప్లేట్ సెల్స్ కౌంట్ చూస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే వీర్యకణాల సంఖ్యను కూడా జోడించాడేమో అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుని అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు చరిత్రకు ఎక్కుతున్న తరుణంలో ఇలాంటి వింత ప్రవర్తనలతో, విక‌ృత చేష్టలతో సామాజిక మాధ్యమాలను బ్రష్టు పట్టిస్తున్నారు. ఏదైనా మంచికి ఉపయోగించుకుంటే సత్ఫలితాలు వస్తాయి. అదే చెడుకు ఉపయోగించుకుంటే దాని ప్రభావం సమాజంపై కూడా కొంత ప్రభావం చూపుతుంది అని చెప్పవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..