Elvish Yadav Case: పాము విషాన్ని సరఫరా చేసే కింగ్‌పిన్‌ ఎల్విష్ యాదవ్‌ను అరెస్టు చేయాలిః మేనకా గాంధీ

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్ కొత్త చిక్కులు చుట్టుముట్టాయి. ఎల్విష్ యాదవ్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ డిమాండ్ చేశారు. అంతరించిపోతున్న జాతుల కేటగిరీలోకి త్వరలో పాములు కూడా చేరుతాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్ నుంచి కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. యూట్యూబ్‌లో జనాదరణ పొందేందుకు చట్టవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించడంలో వెనుకడుగు వేయడం లేదన్నారు. రేవ్ పార్టీలో పాము విషం సరఫరా చేసినందుకు ఎల్వీష్ యాదవ్‌పై కేసు […]

Elvish Yadav Case: పాము విషాన్ని సరఫరా చేసే కింగ్‌పిన్‌ ఎల్విష్ యాదవ్‌ను అరెస్టు చేయాలిః మేనకా గాంధీ
Maneka Gandhi On Elvish Yadav
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 04, 2023 | 3:39 PM

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్ కొత్త చిక్కులు చుట్టుముట్టాయి. ఎల్విష్ యాదవ్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ డిమాండ్ చేశారు. అంతరించిపోతున్న జాతుల కేటగిరీలోకి త్వరలో పాములు కూడా చేరుతాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్ నుంచి కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. యూట్యూబ్‌లో జనాదరణ పొందేందుకు చట్టవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించడంలో వెనుకడుగు వేయడం లేదన్నారు. రేవ్ పార్టీలో పాము విషం సరఫరా చేసినందుకు ఎల్వీష్ యాదవ్‌పై కేసు నమోదైంది. డ్రగ్స్ కోసం పాము విషాన్ని సరఫరా చేసే కింగ్‌పిన్‌గా ఎల్విష్ యాదవ్‌ అని మేనకా గాంధీ అభివర్ణించారు.

మత్తులో విషం తాగడం వల్ల మనుషులు చనిపోవడం ఖాయమన్న మేనకా గాంధీ.. విషం సరఫరా చేసిన ఎల్వీష్ యాదవ్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఎల్వీష్ యాదవ్‌పై మరో కేసు ఉందని మేనకా గాంధీ గుర్తు చేశారు. మేనకా గాంధీకి చెందిన ఎన్జీవో ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ జంతు సంరక్షణ కోసం పనిచేస్తుంది. అంతరించిపోతున్న జంతువులను స్మగ్లర్ల భారీ నుంచి రక్షించడంలో పోలీస్ శాఖ విఫలమైందని మేనకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు, అటవీ శాఖ పాత్రపై ఆయన ప్రశ్నలు సంధించారు. జంతువులను రక్షించడంలో పోలీసు, అటవీ శాఖల వైఫల్యాన్ని ఎన్జీవోలు భర్తీ చేయాలని బీజేపీ ఎంపీ పిలుపునిచ్చారు.

దేశ రాజధాని ఢిల్లీ శివారులో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని నోయిడా పోలీసులు ఛేదించారు. ఐదుగురి అరెస్ట్‌తో పాటు ఘటనా స్థలం నుంచి తొమ్మిది పాములను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ పేరు బయటకు వచ్చింది. నోయిడాలోని సెక్టార్-51లోని బాంక్వెట్ హాల్‌పై పోలీసులు దాడి చేశారు. ఎన్జీవో పీఎఫ్ఏ సమాచారంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎన్జీవో పీఎఫ్ఏ ఫిర్యాదు మేరకు ఎల్విష్ యాదవ్ సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్విష్ అనే యూట్యూబర్ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రేవ్ పార్టీలో యూట్యూబ్ కోసం తీసిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..