PM Modi: మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ.. తన స్కెచ్ వేసిన చిన్నారికి ప్రత్యేక లేఖ..!
PM Modi Writes Letter To A Girl: ఓ చిన్నారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల ఛతీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధానిని.. ఓ బాలిక ఆకర్షించింది. ఆమె పేరు ఆకాంక్ష ఠాకూర్. కంకేర్ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలో.. ఆ బాలిక చేతిలో ప్రధాని స్కెచ్ పట్టుకున్న కనిపించింది.

ఓ చిన్నారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల ఛతీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధానిని.. ఓ బాలిక ఆకర్షించింది. ఆమె పేరు ఆకాంక్ష ఠాకూర్. కంకేర్ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలో.. ఆ బాలిక చేతిలో ప్రధాని స్కెచ్ పట్టుకున్న కనిపించింది. ఇక దాన్ని గమనించిన ప్రధాని మోదీ ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమె గురించి ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ఓ లేఖను కూడా రాశారు. ‘ప్రియమైన ఆకాంక్ష, నీకు ఎలప్పుడూ అదృష్టం, ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నా. కంకేర్ ర్యాలీ కార్యక్రమానికి మీరు తీసుకువచ్చిన స్కెచ్ నాకు చేరింది. మీ ఆప్యాయత వ్యక్తీకరణకు ధన్యవాదాలు” అని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు. ‘భారతదేశపు కుమార్తెలు దేశానికి ఉజ్వల భవిష్యత్తు. మీ అందరి నుంచి నేను పొందుతున్న ఈ ఆప్యాయత, అనుబంధం దేశ సేవ చేయడంలో నాకు కొండంత బలం. మన కుమార్తెల కోసం ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం’ అని అన్నారు.
‘తాను ఎప్పుడు పర్యటనకు వచ్చినా.. ఛతీస్‌గఢ్ ప్రజల నుంచి ఎంతో ప్రేమాభిమానం లభిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలు దేశ ప్రగతి పధంలో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. రాబోయే 25 ఏళ్లు దేశానికి మీలాంటి యువత ఎంతగానో అవసరమని తెలిపారు. అలాగే మీలాంటి కుమార్తెలు ఎన్నో సంచలనాలు నమోదు చేసి.. దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తున్నారన్నారు ప్రధాని మోదీ. మీరు కష్టపడి చదవి.. ముందుకు సాగండి. మీ విజయాలతో మీ కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎనలేని కీర్తిని తీసుకురండి. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు ప్రధాని మోదీ.
#WATCH | A young girl, Akanksha had brought a sketch of PM Narendra Modi to present it to him at his event in Kanker, Chhattisgarh on 2nd November.
The Prime Minister has now written to her, thanking her for the sketch. https://t.co/rW6q56PBkm pic.twitter.com/EP580rDSSC
— ANI (@ANI) November 4, 2023
Prime Minister Narendra Modi writes to Akanksha who had brought him his sketch at his event in Kanker, Chhattisgarh on 2nd November.
The Prime Minister had accepted the sketch from her and told her to leave her correspondence address with him so that he could write to her. pic.twitter.com/oUumyTK6Fk
— ANI (@ANI) November 4, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..