Crime: దారుణం.. మహిళపై లైంగిక దాడి చేసి.. మూడు ముక్కలు చేసిన వైనం.. వీడియో.

Crime: దారుణం.. మహిళపై లైంగిక దాడి చేసి.. మూడు ముక్కలు చేసిన వైనం.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 04, 2023 | 8:55 AM

ఉత్తరప్రదేశ్‌లో దారుణాలకు అంతేలేకుండా పోతోంది. రోజుకో దారుణ ఘటన వెలుగులోకి వస్తోంది. బాందాలో ఓ దళిత మహిళపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా అనంతరం ఆమెను ముక్కలుగా కోసి హత్యచేశారు. గిర్వాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్టోబరు 31న ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాందాకు చెందిన ఓ దళిత మహిళ స్థానికంగా ఉండే రాజ్‌కుమార్‌ శుక్లా అనే వ్యక్తి ఇంట్లో ఫ్లోర్‌ మిల్‌లో పనిచేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో దారుణాలకు అంతేలేకుండా పోతోంది. రోజుకో దారుణ ఘటన వెలుగులోకి వస్తోంది. బాందాలో ఓ దళిత మహిళపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా అనంతరం ఆమెను ముక్కలుగా కోసి హత్యచేశారు. గిర్వాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్టోబరు 31న ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాందాకు చెందిన ఓ దళిత మహిళ స్థానికంగా ఉండే రాజ్‌కుమార్‌ శుక్లా అనే వ్యక్తి ఇంట్లో ఫ్లోర్‌ మిల్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో మిల్‌ శుభ్రం చేయడానికి శుక్లా ఇంటికి వెళ్లింది ఆ మహిళ. అయితే ఎంతకూ మహిళ ఇంటికి రాకపోవడంతో ఆమె కుమార్తె అక్కడికి వెళ్లింది. ఇంట్లోని ఓ గదిలోంచి మహిళ అరుపులు వినిపించాయి. అక్కడికి వెళ్లి చూసేసరికి.. ఆమె తల్లి మూడు ముక్కలై రక్తపు ముడుగులో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి రాజ్‌కుమార్‌, అతడి సోదరులు బావు శుక్లా, రామకృష్ణ శుక్లాలను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని, నిందితులు ముగ్గురు పారిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విపక్ష నేత, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్‌లో స్పందిస్తూ, బాందాలో జరిగిన ఈ ఘటన మనసు తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.