Eluru: సామాన్య భక్తుడిలా జిల్లా కలెక్టర్‌.. అందరితో కలిసి భిక్ష చేసిన.. వీడియో.

Eluru: సామాన్య భక్తుడిలా జిల్లా కలెక్టర్‌.. అందరితో కలిసి భిక్ష చేసిన.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 04, 2023 | 8:43 AM

అయ్యప్పస్వామి దీక్ష అంటే చాలా కష్టమైనదనే చెప్పాలి. మండలం రోజులపాటు నియమ నిష్టలతో స్వామివారిని పూజించాలి, భజనలు చేయాలి. అయినా చాలామంది భక్తులు స్వామి మాల ధరించి దీక్ష తీసుకుంటారు. మండలం రోజుల తర్వాత శబరిమలకు వెళ్లి స్వామి దర్శనంతో దీక్ష విరమిస్తారు. ఇది సామాన్యులకే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది నిత్యం ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజాసమస్యలు పరిష్కారం ఇలా రకరకాల పనులతో సతమతమయ్యే జిల్లా కలెక్టర్‌ అయ్యప్పమాల ధరించారు.

అయ్యప్పస్వామి దీక్ష అంటే చాలా కష్టమైనదనే చెప్పాలి. మండలం రోజులపాటు నియమ నిష్టలతో స్వామివారిని పూజించాలి, భజనలు చేయాలి. అయినా చాలామంది భక్తులు స్వామి మాల ధరించి దీక్ష తీసుకుంటారు. మండలం రోజుల తర్వాత శబరిమలకు వెళ్లి స్వామి దర్శనంతో దీక్ష విరమిస్తారు. ఇది సామాన్యులకే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది నిత్యం ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజాసమస్యలు పరిష్కారం ఇలా రకరకాల పనులతో సతమతమయ్యే జిల్లా కలెక్టర్‌ అయ్యప్పమాల ధరించారు. ఇటు విధులలోనూ అటు ఆధ్యాత్మికంగానూ విజయవంతంగా ముందుకెళ్తూ ఏలూరుజిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయ్యప్ప దీక్షను చేపట్టడమే కాదు ఇతర స్వాముల్లా భజనలు, అన్నవితరణలోనూ పాల్గొంటున్నారు. జిల్లాకి అధికారి అయి ఉండి, ఓ సామాన్యుడిలా అందరితో కలిసి భజనలు చేయడంతో.. తోటి స్వాములు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గా తన విధులలో ఏమాత్రం అలసత్వం లేకుండా ముందుకు వెళుతూ, ఇటు భగవంతుని దీక్షలో సైతం అంతే బాధ్యతగా ఆయన వ్యవహరిస్తున్న తీరు పలువురికి మార్గదర్శకంగా మారింది. ప్రసన్న వెంకటేష్ నిజాయితీగల అధికారిగా ఇప్పటికే ఎంతో మంది మన్నలను పొందారు. జిల్లా కలెక్టర్ గా ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు వెళుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇటీవల ఆయన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. ఆధ్యాత్మిక చింతన , భక్తి అనేది మనిషిలోని సద్గుణాలను మేల్కొలుపుతుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ఈ క్రమంలోనే అయ్యప్ప దీక్ష చేపట్టిన ఆయన.. ఏలూరు రూరల్ దొండపాడు శ్రీ బాల అయ్యప్ప క్షేత్రంలో 12వ వార్షిక దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ అయ్యప్ప స్వామి మండల అధ్యక్ష స్వాములకు కలెక్టర్ స్వయంగా వడ్డించారు. ఓ జిల్లా కలెక్టర్ సాధారణ వ్యక్తిలా అయ్యప్ప స్వాముల భిక్ష కార్యక్రమంలో పాల్గొని దగ్గరుండి అందరికీ స్వయంగా వడ్డిస్తూ, వారితో కలిసి భోజనం చేయడంతో తోటి స్వాములు ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 04, 2023 08:36 AM