Viral: పాము విషంతో రేవ్‌పార్టీ.. బిగ్‌బాస్ విన్నర్‌పై కేసు.. పాములు, విషాన్ని స్వాధీనం.
వీకెండ్స్‌లో చాలా చోట్ల రేవ్ పార్టీలు చేసుకుంటుంటారు. అందరూ మందు, విందుతో ఎంజాయ్ చేస్తారు. అయితే ఓ రేవ్ పార్టీని పాము విషంతో జరుపుకున్నారు. నోయిడాలోని సెక్టార్ 49లో జరుగుతున్న ఓ రేవ్‌పార్టీపై పోలీసులు నవంబర్ 2 రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 విజేత, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ ఈ రేవ్‌పార్టీ నిర్వహించినట్టు గుర్తించిన పోలీసులు..
వీకెండ్స్‌లో చాలా చోట్ల రేవ్ పార్టీలు చేసుకుంటుంటారు. అందరూ మందు, విందుతో ఎంజాయ్ చేస్తారు. అయితే ఓ రేవ్ పార్టీని పాము విషంతో జరుపుకున్నారు. నోయిడాలోని సెక్టార్ 49లో జరుగుతున్న ఓ రేవ్‌పార్టీపై పోలీసులు నవంబర్ 2 రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 విజేత, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ ఈ రేవ్‌పార్టీ నిర్వహించినట్టు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు రేవ్‌పార్టీలో కొన్ని పాములను స్వాధీనం చేసుకోగా వాటిల్లో ఐదు త్రాచులు, ఒక కొండ చిలువ, రెండు తలల పాము, ర్యాట్ స్నేక్ ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు పార్టీలో 20 మిల్లీ లీటర్ల పాము విషాన్ని కూడా సీజ్ చేసినట్టు తెలిపారు. ఎల్విష్ ఒక పామును చేత్తో పట్టుకొని అడుతున్న వీడియో బయటకు రావడంతో అతడిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడి సందర్భంగా అరెస్టు చేసిన వారిని ప్రశ్నించగా ఎల్విష్ పేరు బయటకు వచ్చిందని, ఎల్విష్ నిర్వహించే పార్టీలకు తరచూ పాములను సరఫరా చేస్తుంటామని వారు వెల్లడించారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటామని అంగీకరించారు. ఈ దాడుల్లో మాదకద్రవ్యాల నిరోధక శాఖ, అటవీ శాఖ, నోయిడా పోలీసులు పాల్గొన్నారు. కేసు నమోదు చేసిన విషయం బయటకు రాగానే ఎల్విష్ పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు ఈ కేసుపై దిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతీ మాలీవాల్ స్పందించారు. ఎల్విష్‌తో కలిసి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇలాంటి వ్యక్తిని సీఎం.. వేదికపై ప్రమోట్ చేశారు. మరోవైపు ఆయన ప్రభుత్వం సాక్షిమాలిక్, బజరంగ్ పునియా వంటి ప్రతిభావంతులను కర్రలతో కొడుతుంది. ఇక ఎల్విష్ వీడియోల్లో మహిళలను దూషిస్తుంటాడు.. అంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.