Pan Masala Omlet: అరె ఏంట్రా ఇది.. పాన్ మసాలాతో బ్రెడ్ ఆమ్లెట్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈమధ్య సామాజిక మాధ్యమాల ప్రభావం సమాజంలో అధికంగా ఉంది. వ్యక్తిగత ఫాలోయింగ్ నుంచి ఆన్లైన్ వ్యాపారంతో పాటూ వాటి ప్రమోషన్ వరకూ అన్నీ సోషల్ మీడియా వేదికల నుంచే జరుగుతున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువ వీటికి ఆకర్షితులవుతున్నారు. అందుకే ఈ మాధ్యమాలను ఉపయోగించుకుని కొందరు వింత ఫుడ్ రెసిపీలను వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. తద్వారా మంచి ఆదాయాన్ని గణిస్తున్నారు. ఒకప్పుడు తన హోటల్ వివిధ ప్రాంతాలకు విస్తరించాలంటే తలప్రాణం
ఈమధ్య సామాజిక మాధ్యమాల ప్రభావం సమాజంలో అధికంగా ఉంది. వ్యక్తిగత ఫాలోయింగ్ నుంచి ఆన్లైన్ వ్యాపారంతో పాటూ వాటి ప్రమోషన్ వరకూ అన్నీ సోషల్ మీడియా వేదికల నుంచే జరుగుతున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువ వీటికి ఆకర్షితులవుతున్నారు. అందుకే ఈ మాధ్యమాలను ఉపయోగించుకుని కొందరు వింత ఫుడ్ రెసిపీలను వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. తద్వారా మంచి ఆదాయాన్ని గణిస్తున్నారు. ఒకప్పుడు తన హోటల్ వివిధ ప్రాంతాలకు విస్తరించాలంటే తలప్రాణం తోకకు వచ్చేది. దీంతో పాటూ అధికంగా డబ్బులు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు ఇలాంటి వంటకాన్ని అయినా వీడియో తీసి పోస్ట్ చేయడమే. ఇది పది మంది చూస్తే చాలు షేర్లమీద షేర్లు. దీంతో వైరల్గా మారిపోతుంది.
ఇప్పుడు ఇలాంటి ఫుడ్ వైరల్గా మారింది. గుడ్డు తినేవారికి ఆమ్లెట్ ఒక తక్షణం లభించే ఆరోగ్యకరమైన ఆహారం. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు ఉంటే సరిపోతుంది. అయితే అందులో పాన్ మసాలా వేసి ఎవరైనా తినగలరా? అంటే కాస్త అనుమానం కలుగుతుంది. పాన్ మసాలా ఏంటి ఆమ్లెట్ పెద్దగా బాగుండదేమో అనే అనుమానం కలుగుతుంది. పైగా ఇలాంటి ప్రయోగం మీరు ఎప్పుడూ చేసి ఉండక పోవచ్చు. కానీ ఇటీవల ఒక ఆహార విక్రేత ట్యూబెరోస్‌తో ఆమ్లెట్ రెసిపీని తయారు చేయడం ఆసక్తిగా మారింది. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఎన్నో ఏళ్లుగా అత్యంత ప్రాచుర్యం పొందిన అల్పాహారం వంటలలో ఆమ్లెట్ ఒకటి. ఇది ఇన్స్‌టెంట్ ఫుడ్‌గా ఎక్కడైనా ఇట్టే అందుబాటులో ఉంటుంది. ఇందులో రకరకాల రుచుల కోసం కొందరు వెన్న , జున్ను, కూరగాయలు సన్నగా కట్ చేసి వేసి తయారు చేస్తారు. కానీ ఒక వ్యాపార వేత్త వీటన్నింటికీ భిన్నంగా తనదైన స్టైల్‌లో ఆమ్లెట్‌లో పాన్ మసాలా జోడించాడు. దీని రెసిపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది వినేందుకు కాస్త ఫన్నీగా ఉన్నా టేస్ట్ మాత్రం అధిరిపోయింది అంటున్నారు ఇక్కడకు వచ్చే కస్టమర్స్. ఈ వీడియో అభినవ్ (rjabhinavv) అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో (Instagram) లో పోస్ట్ చేయబడింది. రజనిగంధ ఆమ్లెట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంటుంది అని ధీటైన క్యాప్షన్ కూడా జోడించాడు ఈ బిజినెస్ మ్యాన్.
సాధారణంగా ఆమ్లెట్ తయారు చేసేందుకు ఎలాగైతే వస్తువులు సమకూర్చుకుంటామో అలాగే అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అందులో పాన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను 4 లక్షల మంది లైక్ చేశారు. అలాగే, వినియోగదారులు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. బ్రదర్ క్యాన్సర్ మసాలా ఆమ్లెట్ చేయండి అని వ్యంగంగా కామెంట్ చేశారు.మరొకరు సినిమా యాక్టర్ అజయ్ దేవగన్‌కి ఇష్టమైనది అవుతుంది అని ఫన్నీగా స్పందించారు. మరొకరైతే ఈ ఆమ్లెట్ తింటామా లేక ఉమ్మివేయాలా? అంటూ స్పందిస్తున్నారు. అయితే ఇలాంటి వింత ఫుడ్ కాంబినేషన్ గురించి వినడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు చాక్లెట్ ఆమ్లెట్ నుంచి ఫ్రూట్ టీ వరకు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకు కొత్త ఇక వింత పాత ఒక రోత అంటారు మన పెద్దలు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..