ఒకే రోజు కామారెడ్డి, గజ్వేల్‌లో కేసీఆర్‌ నామినేషన్లు.. ఆ సెంటిమెంట్‌‌నే రిపీట్ చేస్తోన్న గులాబీ దళపతి..

Telangana Election 2023: ఎన్నికల వేళలో అసలైన ఘట్టం రానే వచ్చేసింది. ఇప్పటివరకు అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలు అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ఎన్నికల హీట్‌ను పెంచేశాయి. జాబితా లిస్టులో పేర్లు ఉన్నవారు ప్రచారాలు చేసుకోవడానికి.. నామినేషన్లు వేయడానికి సిద్ధమైతే, ఇప్పటికీ కూడా టికెట్ రాని వాళ్లు అసంతృప్తిలో ఉంటూ వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఒకే రోజు కామారెడ్డి, గజ్వేల్‌లో కేసీఆర్‌ నామినేషన్లు.. ఆ సెంటిమెంట్‌‌నే రిపీట్ చేస్తోన్న గులాబీ దళపతి..
CM KCR
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Ravi Kiran

Updated on: Nov 04, 2023 | 8:56 AM

హైదరాబాద్, నవంబర్ 4: ఎన్నికల వేళలో అసలైన ఘట్టం రానే వచ్చేసింది. ఇప్పటివరకు అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలు అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ఎన్నికల హీట్‌ను పెంచేశాయి. జాబితా లిస్టులో పేర్లు ఉన్నవారు ప్రచారాలు చేసుకోవడానికి.. నామినేషన్లు వేయడానికి సిద్ధమైతే, ఇప్పటికీ కూడా టికెట్ రాని వాళ్లు అసంతృప్తిలో ఉంటూ వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నామినేషన్ల సందడి షూరూ అయింది. నామినేషన్ల తర్వాత కేవలం 15 రోజులు గడువు మాత్రమే ఉండటంతో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు సుడిగాలి పర్యటనలు చేస్తూ సభల్లో పాల్గొంటున్నాయి. ఒకరికి ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాము చేసిన పనులను అధికార పార్టీ గొప్పగా చెప్పుకుంటూపోతుంటే.. అధికార పార్టీ చేయని పనులను, సమస్యలను లేవనెత్తుతూ దుమ్మెత్తిపోస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.

మరోవైపు శుక్రవారం నుంచి మొదలైన నామినేషన్ల ప్రక్రియతో ఎన్నికల జోష్ ట్రిబుల్ అయింది. మొదటి రోజే 94 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేయగా.. ఈ నెల 9న సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. సీఎం సెంటిమెంట్ ప్రకారం నామినేషన్ వేసేందుకు ముందు మరోసారి ఆ దేవుడిని దర్శించుకోనున్నారు.

ప్రతీసారి సీఎం కేసీఆర్ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు ముందు సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో వెలిసిన వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవ్వనున్నారు ముఖ్యమంత్రి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న సీఎం కేసీఆర్ తాను దాఖలు చేయనున్న నామినేషన్ పత్రాలకు పూజలు చేయించడానికి శనివారం ఆలయాన్ని సందర్శిస్తారు. ఉదయం 10 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా గ్రామానికి చేరుకొని కోయినపల్లిలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.

నామినేషన్ పత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాగా, సీఎం కేసీఆర్ ఈ నెల 9న ఉదయం గజ్వేల్‌లో.. మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. అటు 1985లో సిద్దిపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా మొదటిసారిగా పోటీ చేసిన కేసీఆర్.. ఆ సమయం నుంచి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అనంతరం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆలయాన్ని సందర్శిస్తూనే ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..