Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కార్యకర్తకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

Telangana: కార్యకర్తకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

G Peddeesh Kumar

| Edited By: Srikar T

Updated on: Nov 04, 2023 | 11:26 AM

ఓ కార్యకర్త చనిపోతే ఆ ఎమ్మెల్యే చెలించి పోయాడు.. తన ప్రచార కార్యక్రమాలు నిలిపివేసి అంతిమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అంతిమయాత్రలో తానే స్వయంగా స్వర్గ రథం నడిపి చివరివరకు అంతిమ సంస్కారాలలో పాల్గొని రుణం తీర్చుకున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఎందుకు అంతలా చెలించి పోయాడో మీరే చూడండి. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గూడూరు మండలం పొనుగోడు సర్పంచ్ నలమాస వెంకన్న గుండెపోటుతో మృతి

ఓ కార్యకర్త చనిపోతే ఆ ఎమ్మెల్యే చెలించి పోయాడు.. తన ప్రచార కార్యక్రమాలు నిలిపివేసి అంతిమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అంతిమయాత్రలో తానే స్వయంగా స్వర్గ రథం నడిపి చివరివరకు అంతిమ సంస్కారాలలో పాల్గొని రుణం తీర్చుకున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఎందుకు అంతలా చెలించి పోయాడో మీరే చూడండి.

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గూడూరు మండలం పొనుగోడు సర్పంచ్ నలమాస వెంకన్న గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే తన ప్రచార కార్యక్రమాలు మొత్తం వాయిదా వేసుకొని పొనుగోడు గ్రామానికి వెళ్ళారు. తన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే కార్యకర్త మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అంతిమ యాత్ర కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే స్వయంగా నడిపాడు. ఆ సర్పంచ్ దగ్గరుండి నిర్మించిన వైకుంఠధామం లోనే అతని అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కుమారుడు సూర్యచంద్ర కూడా అంతిమ సంస్కారాలలో పాడే మోశారు.