‘అవన్నీ ఎన్నికల వ్యాఖ్యలే’.. సీఎం కేసీఆర్ కామెంట్స్‌ను తిప్పికొట్టిన వైసీపీ నేతలు..
AP Vs Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ-తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఏపీలో రోడ్ల పరిస్థితిపై సీఎం కేసీఆర్ వేసిన సెటైర్లకు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ మంత్రులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిని, తెలంగాణలో రోడ్ల పరిస్థితిని గమనించాలని ఓటర్లకు సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ-తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఏపీలో రోడ్ల పరిస్థితిపై సీఎం కేసీఆర్ వేసిన సెటైర్లకు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ మంత్రులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిని, తెలంగాణలో రోడ్ల పరిస్థితిని గమనించాలని ఓటర్లకు సూచించారు. ఏపీ రోడ్ల పరిస్థితిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. హైదరాబాద్‌లో వర్షం పడితే పిల్లలు నాలాల్లో కొట్టుకుపోయారనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ కాదని తేల్చి చెప్పారు కారుమూరి.
ఆంధ్రప్రదేశ్ ధాన్యం తెలంగాణలో అమ్ముతున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కారుమూరి తిప్పికొట్టారు. ఆంధ్రాలో ఉన్న సన్న బియ్యం తెలంగాణకు తీసుకెళ్లడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత సజ్జల కూడా కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌వి కేవలం ఎన్నికల వ్యాఖ్యలేనని కొట్టిపారేశారు. ఎన్నికల్లో గొప్పగా చెప్పుకోవడానికి కేసీఆర్ చిన్న చిన్న రోడ్లు గురించి మాట్లాడి ఉండొచ్చునని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తోన్న పించన్ పథకాన్ని గతంలో కేసీఆర్ మెచ్చుకొన్న విషయాన్ని సజ్జల గుర్తుచేశారు. సీఎం జగన్ అందిస్తున్న పథకాలను నచ్చాయని వారే చెప్పారని.. తాము పక్కవారి గురించి ఎప్పుడూ మాట్లాడబోమని తెలిపారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా బీఆర్‌ఎస్- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది.