కొనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి కేసీఆర్.. ఇదో సెంటిమెంట్ ??
తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్‌లు వేయడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తన మరో సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్‌లు వేయడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తన మరో సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం లోని కోనాయిపల్లి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కేసీఆర్‌కు ఇది సెంటిమెంట్ దేవాలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేస్తారు. ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎన్నికల సమయంలోనూ ఇక్కడ పూజలు చేసి నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ ఘన విజయం సాధించారు. దాంతో కేసీఆర్‌కు ఈ ఆలయం సెంటిమెంట్‌గా మారింది. అంతేకాదు, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటన చేశారు. అప్పటినుంచి తిరుగులేని పార్టీగా విజయపథంలో దూసుకెళ్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానానికి అడ్డంగా వెళ్లిన మహిళ !!
TOP 9 ET News: వామ్మో.. పెళ్లి ఖర్చు..మరీ అన్ని కోట్లా | అమ్మో.. 135 కోట్లు.. ఆగని డబ్బుల లెక్క
ఆ ఊరికి దెయ్యం భయం… ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం
బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే పియానో వాయించాడు
Vijay Thalapathy: మీ కాలికింద చెప్పునవుతా.. సూపర్ స్టార్ పొలిటికల్ కామెంట్స్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

