Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానానికి అడ్డంగా వెళ్లిన మహిళ !!

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానానికి అడ్డంగా వెళ్లిన మహిళ !!

Phani CH

|

Updated on: Nov 03, 2023 | 8:57 PM

బస్సు లేదా కారు బయలుదేరి వెళ్లిపోతుంటే ఆపండీ.. అంటూ చేతులు ఊపుతూ ఆపుతాం. మరి టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని ఆపిన ఘటనలను చాలా అరుదుగా చూస్తుంటాం. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా నుంచి ఆడిలైట్ వెళ్లాల్సిన ఓ మహిళ నిర్వాకం కారణంగా చివరి క్షణంలో ఆపాల్సి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన నిందిత మహిళ విమానాన్ని అందుకునేందుకు విమానాశ్రయం రన్ వే పైకి పరిగెత్తింది. టేకాఫ్‌కు రెడీ అవుతున్న సమయంలో పైలెట్‌కి కనిపించేలా విమానం చుట్టూ సదరు మహిళ తిరుగాడింది.

బస్సు లేదా కారు బయలుదేరి వెళ్లిపోతుంటే ఆపండీ.. అంటూ చేతులు ఊపుతూ ఆపుతాం. మరి టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని ఆపిన ఘటనలను చాలా అరుదుగా చూస్తుంటాం. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా నుంచి ఆడిలైట్ వెళ్లాల్సిన ఓ మహిళ నిర్వాకం కారణంగా చివరి క్షణంలో ఆపాల్సి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన నిందిత మహిళ విమానాన్ని అందుకునేందుకు విమానాశ్రయం రన్ వే పైకి పరిగెత్తింది. టేకాఫ్‌కు రెడీ అవుతున్న సమయంలో పైలెట్‌కి కనిపించేలా విమానం చుట్టూ సదరు మహిళ తిరుగాడింది. సెక్యూరిటీ కళ్లుగప్పి ఆమె విమానం దగ్గరకు చేరుకుంది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను ఆశ్చర్యపరిచిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నిందితురాలిని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై 2 కేసులు నమోదు చేశారు. సెక్యూరిటీ జోన్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం, కొద్ది పరిణామంలో గంజాయిని కలిగివుందని కూడా అభియోగాలు మోపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: వామ్మో.. పెళ్లి ఖర్చు..మరీ అన్ని కోట్లా | అమ్మో.. 135 కోట్లు.. ఆగని డబ్బుల లెక్క

ఆ ఊరికి దెయ్యం భయం… ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం

బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే పియానో వాయించాడు

Vijay Thalapathy: మీ కాలికింద చెప్పునవుతా.. సూపర్ స్టార్ పొలిటికల్ కామెంట్స్

Sushmita Sen: సుస్మితాసేన్‌కు గుండెపోటు.. కారణం ఇదే..